Shimla mosque row | మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని మేమే కూల్చివేస్తాం.. కమిషనర్‌కు ముస్లిం కమిటీ లేఖ
Shimla mosque row | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ (Shimla mosque row) నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలోని మసీదును అక్రమంగా నిర్మించినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి. దేవ్ భూమి సంఘర్ కమిటీ పిలుపుమేరకు బుధవారం ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతోపాటు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మహిళలు, పోలీసులతో సహా సుమారు పది మంది గాయపడ్డారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ముస్లిం సంక్షేమ కమిటీ ప్రతినిధులు గురువారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూపేందర్ కుమార్ అట్రీని కలిశారు. అనధికారిక భాగాన్ని సీల్ చేయాలని కోరారు. అలాగే కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు.
మరోవైపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు హిమాచల్ ప్రదేశ్‌లో శాశ్వత నివాసితులని ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మత సామరస్యం, సోదరభావాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంక్షేమ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ షఫీ కాస్మీ మీడియాతో అన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన చెప్పారు.
కాగా, మసీదులో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన దేవ్ భూమి సంఘర్ కమిటీ ఈ చర్యను స్వాగతించింది. ‘ముస్లిం సమాజం చర్యను మేం స్వాగతిస్తున్నాం. పెద్ద ఆసక్తితో ఈ చొరవ తీసుకున్నందుకు వారిని కౌగిలించుకునే మొదటి వ్యక్తి నేనే అవుతా’ అని కమిటీ సభ్యుడు విజయ్ శర్మ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

