Satyadev New Film | యువ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 15వ చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. లక్ష్మీనారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని త్రిషూల్ విజినరీ స్టూడియోస్ పతాకంపై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఈ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్నేహం నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘రావుబహదూర్’, ‘గరుడ చాప్టర్-1’ వంటి వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్, ఈ కొత్త ప్రాజెక్టుతో మరో ఆసక్తికరమైన జోనర్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
#SD15 – ‘A Fun Blast’ begins 🤩@ActorSatyadev unleashing himself into a never before entertaining avatar 🤫😉
Produced by #NarendraReddy, Under @TrishulVSoffl Production No.4 !
Written & Directed by @LNPUTTAMCHETTY 🎬
A @Ram_Miryala Musical 🎶🥁@faria_abdullah… pic.twitter.com/YOv0arlpWY
— Vamsi Kaka (@vamsikaka) February 18, 2026