హైదరాబాద్ : దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి(Girl Died) చెందింది. అయితే డ్రైవర్ను స్కూల్ యాజమాన్యం సంఘటన స్థలం నుంచి పంపించినట్లు తెలిసింది. విద్యార్థిని బస్సు నుంచి జారిపడి(Road Accident) మృతిచెందిందని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, కేసును తప్పుదోవ పట్టించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వవరాలు తెలియాల్సి ఉంది.
Also Read..