హిమాయత్‌నగర్,నవంబర్4 : సదర్ ఉత్సవాలను(Sadar festival) వీక్షించేందుకు వచ్చిన పలువురి సెల్ ఫోన్లు(Cell phones) చోరీకి గురైన సంఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ నా గార్జున తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి నారాయణ గూడలోని వైఎంసీఏ చౌరస్తాలో జరిగిన సదరు ఉత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యల్లో ప్రజలు తరలించారు. దున్న పోతుల విన్యాసాలను మైమరిచి చూస్తుండగా ఇదే అదునుగా భావించి, జనం రద్దీగా ఉన్న ప్రాంతాలలో దుండగులు 22 సెల్ఫోన్లను తస్కరించుకుని పారిపోయారు.
బాధితులు జేబులో పెట్టుకున్న సెల్ఫోన్లు కన్పించక పోవడంతో ఆందోళన చెంది చోరీకి గురైనట్లు గుర్తించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితులను పట్టుకునేందుకు సదరు ఉత్సవాల ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఐ నాగార్జున తెలిపారు.
ఇవి కూడా చదవండి..
MHSRB | నవంబర్ 10న ల్యాబ్ టెక్నిషీయన్ గ్రేడ్-II పోస్టులకు రాతపరీక్ష
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎండీ హోమియో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Karthika Masam | వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రం..