KNRUHS | హైదరాబాద్ : కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో ఎండీ హోమియో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 10 సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వెబ్ ఆప్షన్ల నమోదు కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వెబ్ ఆప్షన్ల నమోదు తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం knruhs.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
MLA Sabitha | తెలంగాణకు అవార్డులు తెచ్చిన వారిని అరెస్టు చేసి అవమానిస్తారా..? : ఎమ్మెల్యే సబిత
KTR | బ్లాక్మెయిల్ సీఎంతో తెలంగాణ వందేళ్లు వెనక్కి.. రాహుల్పై కేటీఆర్ ధ్వజం