MLA Sabitha | హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసన చేపట్టిన మాజీ సర్పంచ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. నిరసనకు దిగిన సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలోనే ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్ది, తెలంగాణకు అవార్డులు తెచ్చిన వారిని అరెస్టు చేసి అవమానిస్తారా..? అని ఎమ్మెల్యే సబిత నిలదీశారు. నాడు పల్లెప్రగతితో ప్రతి నెల నిధులు ఠంచన్‌గా విడుదలయ్యేవని గుర్తు చేశారు. నేడు నిధులు రాక గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని ధ్వజమెత్తారు. నాడు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసిన సర్పంచ్‌లను నేడు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికి బేడీలు వేస్తారా..? అని నిలదీశారు.
మాజీ సర్పంచుల అరెస్ట్ అక్రమం,అన్యాయం అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. న్యాయమైన మాజీ సర్పంచుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | బ్లాక్మెయిల్ సీఎంతో తెలంగాణ వందేళ్లు వెనక్కి.. రాహుల్‌పై కేటీఆర్ ధ్వజం