MHSRB | హైదరాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నిషీయన్స్ గ్రేడ్-II పోస్టులకు ఈ నెల 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(MHSRB) అధికారికంగా ప్రకటించింది.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1.30 నుంచి అనుమతించనున్నారు. 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. తదితర వివరాల కోసం mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.
ఇవి కూడా చదవండి..
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎండీ హోమియో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
MLA Sabitha | తెలంగాణకు అవార్డులు తెచ్చిన వారిని అరెస్టు చేసి అవమానిస్తారా..? : ఎమ్మెల్యే సబిత