ఆహ్లాదానికి చిరునామా..

అంబర్‌పేట, జనవరి 23 : బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని సెంట్రల్ ఎక్సైజ్ (సీఈ) కాలనీ పార్కు ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నది. పచ్చని చెట్ల మధ్య స్థానికులు హాయిగా సేదతీరేలా ఈ పార్కును అందంగా ముస్తాబు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కాలనీవాసులంతా ఈ పార్కులో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దారు. ఈ పార్కు జీహెచ్ఎంసీ నుంచి ‘స్వచ్ఛ కాలనీ’ అవా ర్డు పొందడం విశేషం.
వివరాలు.. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని సెంట్రల్ ఎక్సై జ్ కాలనీ అసోసియేషన్ ద్వారా కా లనీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పార్కు గ్రీనరీతో కళకళలాడుతున్నది. ఇందులో ఎక్కడ చూసి నా పచ్చదనమే కనిపిస్తుంది. కాలనీవాసులంతా ఉదయం, సాయంత్రం వాకింగ్‌తో పాటు వ్యాయామం కోసం ఈ పార్కునకు వస్తారు. మహిళలు కూడా ఇక్కడ యోగా చేస్తారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక టా యిలెట్లను ఏర్పాటు చే శారు. కాలనీవాసులు స మావేశాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని కట్టించారు. అందులో లైబ్రరీని ఏర్పాటు చేశారు. వృద్ధులు కూర్చునేందుకు కుర్చీలు, పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. అలసిపోయిన వారు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చోని వెళ్తుంటారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి పడాల వెంకట్రావు, అసోసియేషన్ ప్రతినిధులు అంతా కలిసికట్టుగా ఈ పార్కు నిర్వహణను చూస్తున్నారు.
ఏడాది క్రితం స్వచ్ఛ అవార్డు...
ఏడాది క్రితం కాలనీని అన్ని రంగా ల్లో ప్రథమంగా ఉంచినందుకు జీహెచ్ఎంసీ నుంచి ‘స్వచ్ఛ కాలనీ’ అవార్డు లభించింది. కాలనీని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నిర్వహణ కూడా మెరుగ్గా ఉండటంతో ఈ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్