గురువారం 28 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:13:06

గుర్తించి.. పరీక్షించి

గుర్తించి.. పరీక్షించి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌లుగా గుర్తిస్తున్నది. ఆ జోన్‌లలో ఇంటింటికీ ఆరోగ్య సర్వే చేసి వ్యాధి లక్షణాలున్న వారిని దవాఖానలకు తరలిస్తున్నది. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలోని కార్వాన్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌,  మలక్‌పేట్‌ జోన్‌లలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో ఆ ప్రాంతాల్లో మరింత పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. సర్వే కోసం 2276 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జె.వెంకటి తెలిపారు. 85 మంది వైద్యులు, 90 మంది మలేరియా సిబ్బంది, 1019 ఆశ వర్కర్లు, 382 మంది ఏఎన్‌ఎంలు, 700 మంది అంగన్‌వాడీలు ఆరోగ్య సర్వేలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారిని హోమ్‌ క్వారంటైన్‌ చేయడంతో పాటు కరోనా అనుమానితులను దవాఖానలకు తరలించి పరీక్షలు చేస్తున్నారు.


logo