జూబ్లీహిల్స్,అక్టోబర్31: అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సోమాజీగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ, జయప్రకాశ్‌నగర్‌లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా మాగంటి కుమార్తెలు అక్షర, దిశిరలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉన్నారని.. అందుకే నేడు ఏ ఇంటికి వెళ్లినా మాగంటి కుటుంబానికి అండగా ఉంటామంటున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతా గోపీనాథ్‌కు.. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.