మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 31: మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పేషెంట్ రాజును బతికుండగానే మార్చురీ గదికి తరలించడంపై శుక్రవారం అధికారులు విచా రణ చేపట్టారు. విచారణ కమిటీ సభ్యులైన చంద్రశేఖర్, శ్రీధర్, గోపాల్‌రావు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. సూపరింటెండెంట్‌ను కలిసి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మార్చురీ పరిసరాలు, హాస్పిటల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ రాజు ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలను సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో గురువారం జరిగిన సంఘటనపై విచారణకు వచ్చామని తెలిపారు. డ్యూటీ డాక్టర్, మార్చురీ సిబ్బంది, పేషెంట్ రాజు వాంగ్మూలాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నామని చెప్పారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ రా జును శుక్రవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పరామర్శి.. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.