e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఆరోగ్యం Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?

Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?

నమస్తే డాక్టర్‌. నా వయసు పాతికేండ్లు. నాకు ఒబేసిటీ, పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నాయి. పెండ్లయి తొమ్మిది నెలలైంది. గర్భం రావాలంటే నా భర్తతో ఏ రోజుల్లో శృంగారంలో పాల్గొనాలి.

-మహేశ్వరి, కామారెడ్డి

- Advertisement -

ముందు మీరు బరువు తగ్గాలి. అధిక బరువు వల్ల అండం నెలనెలా విడుదల కాదు. ఆలస్యం అవ్వొచ్చు, కొన్నిసార్లు అసలు విడుదల కాకపోవచ్చు. దీంతో ఫెర్టిలిటీ సమయం.. అంటే, అండం విడుదలయ్యే సమయం, తేదీలు చెప్పడం సాధ్యం కాదు. మొదట మీరు బరువు తగ్గడానికి యోగా, వాకింగ్‌, డైటింగ్‌ మొదలు పెట్టండి. న్యూట్రిషనిస్ట్‌ను కలవండి. తరువాత నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో, అంటే మీ 28-30 రోజుల రుతుక్రమం అవుతూ ఉంటే.. నెలసరి అయిన 12వ రోజు నుంచి 20 రోజుల మధ్యలో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక థైరాయిడ్‌ పరీక్షలు రెగ్యులర్‌గా చేయించుకొంటూ, మందులు వాడుతూ ఉండాలి. థైరాయిడ్‌ సమస్యకి, ఇన్ఫెర్టిలిటీకి సంబంధం ఉంది. మీ భర్త వీర్యకణాల సంఖ్య, వాటి ఆరోగ్య
స్థితికి సంబంధించి సెమెన్‌ ఎనాలిసిస్‌ చేయించడం కూడా ముఖ్యమే.

నా వయసు 46. మా ఆవిడ వయసు 36. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేండ్ల క్రితం మా ఆవిడకు కడుపులో నొప్పి వస్తుంటే డాక్టర్‌కు చూపించాను. ఎండోమెట్రియాసిస్‌ ఉంది. ఇంత చిన్న వయసులో ఆపరేషన్‌ చేయటం మంచిది కాదని మందులు రాశారు. కానీ నొప్పి తగ్గలేదు. దాంతో ఆపరేషన్‌ చేసి గర్భసంచి, ఒక ఓవరీ తీసేశారు. అప్పట్నుంచీ సమస్య తగ్గింది. కానీ ఇంతకు ముందులా హుషారుగా ఉండటం లేదు. చిన్న పని చేసినా అలసిపోతోంది. రతి సమయంలో తన యోని లూజుగా ఉంటున్నది. నాకు తృప్తి అనిపించటం లేదు. బాధ పడుతుందని ఈ విషయం తనతో ఎప్పుడూ అనలేదు. కానీ, ఎవరో అన్నారట.. గర్భసంచి తీసేస్తే భర్తను సుఖ పెట్టలేరని. అప్పట్నుంచీ తనూ బాధపడుతోంది. ఈ సమస్యలన్నీ తీరి, మేం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

-రాజు, మధిర

ఇంకో ఓవరీ ఉన్నప్పుడు హార్మోన్లు బాగానే ఉంటాయి. యోని వదులవడం అన్నది.. ఆవిడలో శృంగార ప్రేరణలు, లూబ్రికేషన్‌ ఆరోగ్యవంతంగా కలుగుతున్నాయనడానికి సూచన. హార్మోన్లు తక్కువుంటే యోని కొద్దిగా ఎండిపోయి, లూబ్రికేషన్‌ కాదు. హిస్టరెక్టమీకి, శృంగార వాంఛలు తగ్గడానికి, శృంగార ప్రక్రియకు ఏ సంబంధమూ లేదు. భర్తను సుఖపెట్టక పోవటమూ లేదు. అధిక లూబ్రికేషన్‌ను నివారించడానికి, శృంగారం మధ్యలో భార్యా భర్తలిద్దరూ శుభ్రమైన కాటన్‌ గుడ్డతో తుడుచుకోవచ్చు.

డా. భారతి (ఎమ్మెస్‌)
Sexologist & psychotherapist
మారిటల్‌ కౌన్సిలర్‌, జయా హాస్పిటల్‌
బీ.ఎన్‌. రెడ్డి నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
bharathid506@gmail.com, 9908383910

ఇది కూడా చూడండి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బైపాస్‌ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?

ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?

తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు

ఈ మ‌ధ్యే పెండ్ల‌యింది.. నా అనుమానం నిజమేనా

ఆరు నెల‌లుగా మా ఆవిడ ముట్టుకోనివ్వ‌డం లేదు.. ఏం చేయమంటారు?

శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..

బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana