గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jun 12, 2020 , 20:36:05

దగ్గు వేదిస్తోందా.? అయితే ఇలా చేయండి

దగ్గు వేదిస్తోందా.? అయితే ఇలా చేయండి

అసలే కరోనా కాలం. ఈ సమయంలో దగ్గినా, తుమ్మినా సరే అనుమానించి క్వారంటైన్లో పెడుతున్నారు. ఈ సమయంలో వైరల్‌ ఫీవర్లు వచ్చినా ప్రమాదమే. ముఖ్యంగా దగ్గు వచ్చిందంటే దాన్ని నివారించడం చాలా కష్టం. టానిక్‌లు, యాంటిబయోటిక్స్‌ వాడినా వెంటనే ఫలితం ఉండదు. అయితే మనం దగ్గు ముందును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

  • పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు ఎక్కువ. దగ్గు బాగా వేదిస్తుంటే.. కొద్దిగా పసుపు, తేనె కలిపి తాగాలి.
  • సొంటి పౌడర్‌, తేనె మిశ్రామాన్ని నిత్యం తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • గోరువెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. దీని వల్ల దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
  • అల్లం టీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని నీళ్లలో అల్లం ముక్కలు వేసి వేడి చేయాలి. దీని వల్ల అల్లంలోని ఔషదాలు నీటిలో కలుస్తాయి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2,3 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • శ్వాస నియంత్రణ ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు. లోతుగా గాలి పీల్చి రెండు సెకన్ల తర్వాత బయటికి వదలండి. దీని వల్ల దగ్గును నివారించవచ్చు. 


logo