చెత్తను డస్ట్బిన్లలో వేయండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం.. అని ఎన్నిసార్లు చెప్పినా మనషులమైన మనం అసలు పట్టించుకోం.
కానీ ఓ కాకి మాత్రం ఈ విషయంలో మనషులు సిగ్గుపడేలా చేసింది. పక్కనే డస్ట్ బిన్ ఉన్నప్పటికీ కొందరు చెత్తను బయట పడేశారు. చెత్తను గమనించిన ఆ కాకి.. ఓపికతో ఆ చెత్తను డస్ట్ బిన్లో వేసి మనషుల కళ్లు తెరిపించింది. ఈ దృశ్యాలను ఫారెస్టు సర్వీసెస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2
— Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021