కలగా మెట్రో !
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను అప్పణంగా కట్టబెట్టి, నిధులు మంజూరు చేస్తున్న మోదీ సర్కారు.. కోటిన్నర జనాభా నిండిన హైదరాబాద్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
- 508 రోజులుగా మెట్రో సాధన సమితి పోరాటం
- చిన్న నగరాలకు నిధులు, సిటీకి మొండిచెయ్యి
- కోటిన్నర ప్రజల ఆవేదన పట్టించుకోని ఢిల్లీ పెద్దలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం
సిటీబ్యూరో : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను అప్పణంగా కట్టబెట్టి, నిధులు మంజూరు చేస్తున్న మోదీ సర్కారు.. కోటిన్నర జనాభా నిండిన హైదరాబాద్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు ఆమోదం తెలపాల్సిన కేంద్రం, ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్కారు చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రాజెక్టును పక్కదారి పట్టిస్తోంది.
దీంతో ఇరు ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ.. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత పోరాటం నేటికి 508వ రోజుకు చేరుకున్నది. దాదాపు రెండున్నరేళ్లుగా అలుపెరగకుండా, సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంతోనైనా కేంద్ర, రాష్ట్ర సర్కారులు జాడ్యాన్ని వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు కేంద్రమైన మహానగరంలో కనీస రవాణా సదుపాయాలు లేక నిత్యం లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు.
ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం..
రాష్ర్టానికి రావాల్సిన మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టులతోపాటు, నగరానికి దక్కాల్సిన ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం తొక్కి పెడుతొందని మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆరోపించింది. సమితి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 2600 మంది క్రియాశీలక సభ్యులతో కూడిన ఈ సమితి సోషల్ మీడియాలో చురుకైనా పాత్రను పోషిస్తోంది. మెట్రో ఫేజ్-2 విషయంలో నగరానికి జరుగుతున్న నష్టాన్ని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని ఎండగడుతూనే ఉంది.
ఢిల్లీ పెద్దలను కదిలించేలా పోస్టులు, డిజిటల్ నిరసనలతో రాష్ట్ర నేతలను ప్రజల ముందు ఎండగడుతూనే ఉంది. అయినా కూడా ఇరు ప్రభుత్వాల్లో కదలిక లేనట్లుగా వ్యవహరిస్తున్నాయని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ప్రతిపాదనలతో రాష్ట్ర సర్కారు, పరిశీలనతో కేంద్రం చేసే కాలయాపనను సహించేది లేదని, అవసరమైతే ప్రాథమిక హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రత్యక్ష ఉద్యమ సన్నాహాలూ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

