భర్తీ చేయరా!
గిరిజన సంక్షేమానికి ఆయువు పట్టుగా ఉన్న ఐటీడీఏలో కీలక పోస్టులు భర్తీకి నోచుకోకపోగా, తాజాగా మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఐటీడీఏ పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. గిరిజనాభివృద్ధికి బీజం వేసి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ లాంటి ప్రధాన శాఖల్లో కీలకమైన సుమారు ఎనిమిది పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోకపోవడంతో క్రమంగా ఆ శాఖలు నిర్వీర్యమయ్యాయి.
- ఐటీడీఏలో కీలక పోస్టులు ఖాళీ
- ఏళ్లుగా అధికారులను నియమించని వైనం
- బదిలీలు, రిటైర్మెంట్లతో ఖాళీ కానున్న మరిన్ని స్థానాలు
- గిరిజన సంక్షేమంపై పట్టింపులేని ప్రభుత్వం
ఏటూరునాగారం, మే 24 : గిరిజన సంక్షేమానికి ఆయువు పట్టుగా ఉన్న ఐటీడీఏలో కీలక పోస్టులు భర్తీకి నోచుకోకపోగా, తాజాగా మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఐటీడీఏ పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. గిరిజనాభివృద్ధికి బీజం వేసి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ లాంటి ప్రధాన శాఖల్లో కీలకమైన సుమారు ఎనిమిది పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోకపోవడంతో క్రమంగా ఆ శాఖలు నిర్వీర్యమయ్యాయి. వాటి ద్వారా చేపట్టే అభివృద్ధి, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ప్రాజెక్టు హార్టికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి పోస్టులు ఏళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో ఈ శాఖలన్నీ ఐటీడీఏలో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ ఉన్న మైనర్ ఇరిగేషన్, సెరికల్చర్ శాఖలను పదేళ్ల క్రితమే ఎత్తేశారు.
అదనపు బాధ్యతలే అధికం..
ప్రస్తుతం ఐటీడీఏలో ఏవోగా పని చేస్తున్న రాంబాబు భద్రాచలం ఐటీడీఏకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ఈ పో స్టు సైతం ఖాళీగా ఉండగా ఎస్వో రాజ్‌కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్‌కుమార్ ఇక్కడ నాలుగేళ్లుగా పని చేస్తుండగా సాధారణ బదిలీల్లో ఆయన ఉ ట్నూరుకు వెళ్తున్నారు. దీంతో ఏవో, ఎస్వో రెండు పోస్టు లు ఖాళీ కానున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇక్కడ ఏపీవోగా పనిచేస్తున్న నాగోరావు ఈనెల 31న ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో వారం రోజు ల్లో ఈ పోస్టు కూడా ఖాళీ కానుంది.
ఏపీవో పోస్టును భర్తీ చేసేందుకు ఐటీడీఏల్లోనే ఈ స్థాయి అధికారులు లేరు. ప్రస్తు తం పనిచేస్తున్న ఏవోలకు పదోన్నతులు ఇస్తే తప్ప ఇక్కడ ఏపీవో పోస్టు భర్తీ అయ్యే అవకాశం లేదు. అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పో స్టు ఖాళీగా ఉండగా భద్రాచలం ఐటీడీఏలో ఏఏవోగా పనిచేస్తున్న సంతోష్ మూడు రోజులు ఇక్కడ, మూడు రోజులు అక్క డ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వచ్చే నెలలో అకౌంట్స్ మేనేజర్ నర్సింగ్ కూడా బదిలీ కానున్నారు. అలాగే మేనేజర్ పోస్టు ఎంతో కాలంగా భర్తీకి నోచుకోవడం లేదు.
ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉట్నూరులో ఎస్‌వోగా పనిచేస్తున్న సురేశ్‌బాబు ఏటూరునాగారం ఐటీడీఏకు డిప్యుటేషన్‌పై వచ్చి ఏడాదిగా పనిచేస్తున్నాడు. పది రోజు ల క్రితం భద్రాచలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేశ్‌బాబు మృ తి చెందడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఐటీడీఏలో ఉన్న ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్‌వో పోస్టు ఐదేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. ప్రస్తు తం వెంకటాపురం మండలం ఎదిర పీహెచ్సీ వైద్యాధికారి క్రాంతికుమార్ రెండేళ్లుగా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఐటీడీఏలో ఖాళీ అవుతున్న కీలక పోస్టులను భర్తీ చేయకుండా ఎవరికో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపు సరిగా లేక ఐటీడీఏ అస్తవ్యస్తంగా మారింది. ఇక విద్యావిభాగంలో ఏటీడీవో, డిప్యూటీ ఈవో పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడం లేదు. ఇటీవల యువ ఐఏఎస్‌ను పీవోగా నియమించిన ప్రభుత్వం కింది స్థాయి పోస్టులను కూడా వెంట నే భర్తీ చేయాలని గిరిజన యువత కోరుతున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

