అక్కడ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కోడి ఫ్రీ.. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఆఫర్లు ఉన్నాయంటే..
కరోనా వ్యాక్సిన్ ఆఫర్లు | వ్యాక్సిన్ వేసుకోవచ్చో.. లేదో.. వేసుకుంటే ఏమవుతుందో.. ఇది టీకాపై ప్రజల్లో ఉన్న భయం. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్

కరోనా వ్యాక్సిన్ ( Corona virus Vaccine ) వేసుకోవచ్చో.. లేదో.. వేసుకుంటే ఏమవుతుందో.. ఇది టీకాపై ప్రజల్లో ఉన్న భయం. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సోషల్ మీడియాలో రూమర్లు తిరుగుతున్నాయి. వీటిపై ఎంతమంది ఎన్నిరకాలుగా అవగాహన కల్పించినా.. ఇంకా వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతన్నారు. దీంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా చేసేందుకు అనేక చోట్ల అనేక రకాల ఆఫర్లు పెడుతున్నారు. కొన్నిచోట్ల బీర్ ఫ్రీగా ఇస్తామంటే.. ఇంకొన్ని చోట్ల చికెన్ ఫ్రీగా అందిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల మొబైల్ రీచార్జ్ కూడా చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో ఒకసారి చూద్దాం..

రెండు మిలియన్ డాలర్ల లాటరీ
వ్యాక్సిన్ వేసుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ లాటరీ టికెట్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. ఈ లాటరీ టికెట్ కింద 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు, కాలేజి ట్యూషన్ అసిస్టెంట్, విమాన టికెట్లు, గేమ్ సిస్టమ్‌ను లాటరీ కింద ఇస్తామని వెల్లడించారు.

ఫ్రీ మొబైల్ రీచార్జి
ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఆసక్తి పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని బెరాసియా ఎమ్మెల్యే విష్ణు ఖత్రీ వినూత్న ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే జూన్ 30 లోపు వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ఉచితంగా మొబైల్ రీచార్జి చేస్తామని ఆయన తెలిపారు.

గన్స్ కొనుక్కునేందుకు డబ్బులు
ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా చేసేందుకు పశ్చిమ వర్జీనియాలో లాటరీ స్కీం తీసుకొచ్చింది. టీకా తీసుకున్నవారికి 1.588 మిలియన్ యూఎస్ డాలర్ల బహుమతి నుంచి షాట్‌గన్స్, రైఫిల్స్ వరకు ఉచితంగా ఇస్తున్నారు.

ఉచితంగా కోడి
ఇండోనేసియాలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిలో వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు పోగొట్టి, టీకా తీసుకునేలా చేయడం కోసం ఇండోనేసియాలో ఉచితంగా కోడిని అందిస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో బీర్ ఫ్రీ
ప్రస్తుతం వ్యాక్సినేషన్లో ఇజ్రాయెల్ ముందు ఉంది.. అయినప్పటికీ యువతను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆఫర్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా బీర్ లేదా డ్రింక్ ఇస్తున్నారు.

షాపింగ్ వోచర్లు
దాదాపు 70 లక్షల మంది జనాభా ఉన్న సెర్బియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గత ఏడాది డిసెంబర్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు కేవలం 29.81 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అది కూడా ఒక్క డోస్ తీసుకున్న వారు మాత్రమే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రకరకాల ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రజలను ఉచితంగా వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకెళ్లడమే కాకుండా.. షాపింగ్ చేసుందుకు డిస్కౌంట్ వోచర్లను కూడా అందిస్తుంది.

బాగ్దాద్‌లో కాఫీ
కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు బాగ్దాద్‌లోని ఒక కాఫీ షాప్ ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ఉచితంగా కాఫీ అందించనున్నట్లు తెలిపింది.

116.5 మిలియన్ డాలర్ల ప్రైజ్
కాలిఫోర్నియాలో అయితే ఏకంగా 116.5 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, గిఫ్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే జూన్ 15వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ ఆఫర్ ఉంది.

గంజాయి కూడా
వాషింగ్టన్లో అయితే లైసెన్స్డ్ గంజాయి ఔట్లెట్ల నుంచి ఒక్కసారి గంజాయిని పొందవచ్చని వాషింగ్టన్ స్టేట్ లిక్కర్ అండ్ కన్నబీస్ బోర్డు ప్రకటించింది. 21 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జూలై 12తో ఈ ఆఫర్ ముగిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
కరోనా వ్యాక్సిన్ ఆఫర్లు |కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నెన్ని ఆఫర్లో.. లాటరీ టికెట్ల నుంచి బీర్లు, మొబైల్ రీచార్జిల దాకా
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

