e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) అమ్మా.. బైలెల్లినామో..

అమ్మా.. బైలెల్లినామో..

  • భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
  • పోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించిన భక్తులు

జడ్చర్ల, ఆగస్టు 3 : జడ్చర్ల మున్సిపాలిటీలోని గణేశ్‌నగర్‌ కాలనీలో మంగళవారం పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి పోచమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాలనీవాసులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ సారిక, కమిషనర్‌ సునీత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, లత, ఉమాదేవి, శ్రీనివాస్‌యాదవ్‌, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో..
మహబూబ్‌నగర్‌టౌన్‌, ఆగస్టు 3 : మున్సిపాలిటీలోని ఎదిర 4వ రెవెన్యూ వార్డులో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ యాదమ్మ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, నాయకులు హన్మంతు, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, రాము లు, వెంటకయ్యగౌడ్‌, బీకే రాములు, నర్సింహులు, సత్యం, మురళీగౌడ్‌, కృష్ణ, శేఖర్‌, నవకాంత్‌, లక్ష్మణ్‌, భాను, శివశంకర్‌, కాశన్న, ఎల్లయ్య, గోపాల్‌, జీ రాములు, నవకాంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్‌హకీం, ధనుంజయ పాల్గొన్నారు.

- Advertisement -

మిడ్జిల్‌ మండలంలో..
మిడ్జిల్‌, ఆగస్టు 3 : మండలంలోని వేముల గ్రామంలో మంగళవారం పోచమ్మ, ఈదమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జంగయ్య, ఎంపీటీసీ యశోద, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాండు, వీరారెడ్డి, ఆంజనేయులు, భీంరాజు, పెంటయ్య, శ్రీను పాల్గొన్నారు.

రాజాపూర్‌ మండలంలో..
రాజాపూర్‌, ఆగస్టు 3 : మండలంలోని తిర్మలాపూర్‌ గ్రా మంలో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేశ్వరీమహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రామకృష్ణాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు పుల్లారెడ్డి, రామ్మూర్తి, చంద్రయ్య, నర్సింహులు, కృష్ణయ్య పాల్గొన్నారు.

భూత్పూర్‌ మున్సిపాలిటీలో..
భూత్పూర్‌, ఆగస్టు 3 : మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌, గోప్లాపూర్‌ గ్రామాలతోపాటు, మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాసులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
దేవరకద్ర రూరల్‌, ఆగస్టు 3 : మండలంలోని కౌకుంట్ల గ్రామంలో పోచమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ స్వప్నకిషన్‌రావు దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కిష్టన్న, పీఏసీసీఎస్‌ డైరెక్టర్‌ కృష్ణగోపాల్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌, జయన్న, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, నర్సింహులు, రమేశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా దేవరకద్ర మండలకేంద్రంలో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కురుమ యాదవులు అమ్మవారికి అంబలిని నైవేద్యంగా సమర్పించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana