e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రశాంతంగా గణేశ్‌ విగ్రహాల ఊరేగింపు

ప్రశాంతంగా గణేశ్‌ విగ్రహాల ఊరేగింపు

  • పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు
  • మండపాల వద్ద అన్నదానం, లడ్డూ వేలం
  • గణనాథులను దర్శించుకున్న భక్తులు

ఊట్కూర్‌, సెప్టెంబర్‌ 15 : మండలంలోని బిజ్వారం, పెద్దపొర్ల, చిన్నపొర్ల, తిప్రాస్‌పల్లి, ఎడవెల్లి, ఓబ్లాపూర్‌, కొ ల్లూరు తదితర గ్రామాల్లో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేశారు. పురవీధుల గుం డా శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ మూర్తులను గ్రా మాల శివారుల్లో ఉన్న చెరువు నీటిలో నిమజ్జనం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

లడ్డు వేలం..
వినాయకుడి చేతిలోని లడ్డును అన్ని గ్రామాల్లో నిర్వాహకులు వేలం నిర్వహించారు. వేలంలో భక్తులు ఉత్సాహ ంగా పాల్గొని లడ్డూ దక్కించుకున్నారు. మండలంలోని పెద్దపొర్ల బీరలింగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి న లడ్డూ వేలంలో రవికుమార్‌ రూ.1.30 లక్షలకు దక్కించుకున్నాడు. వాల్మీకి గణపతి లడ్డును కృష్ణయ్య రూ.41 వే లకు, బిజ్వారంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలోని లడ్డును రాఘవేంద్ర రూ.21,500, చౌడేశ్వరి వి నాయకుడి లడ్డును తులసీదాస్‌ రూ. 16,051, బీసీ కాలనీ వినాయకుడి లడ్డును భాస్కర్‌ రూ.13,500, గౌడ్స్‌ కాలనీ వినాయకుడి లడ్డును రాములుగౌడ్‌ రూ.10 వేలకు దక్కించుకున్నారు.

- Advertisement -

మెడికల్‌ కళాశాలలో..
మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, సెప్టెంబర్‌ 15 : ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వినాయకుడి లడ్డూను రూ.లక్షా25 వేల కు కళాశాల డాక్టర్‌ బుచ్చిబాబు దక్కించుకున్నారు. కళాశా ల డైరెక్టర్‌ డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, వైద్య విద్యార్థులు ఆభినందించారు.

వెన్నాచేడ్‌ సాయిరాంకాలనీలో…
గండీడ్‌, సెప్టెంబరు 15: మండలంలోని వెన్నాచేడ్‌ సా యిరాంకాలనీలో వినాయకుడి లడ్డూను చంద్రయ్య రూ. 50,100లకు దక్కించుకున్నాడు. కార్యక్రమంలో మండ పం నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్‌ మండలంలో..
బాలానగర్‌, సెప్టెంబర్‌ 15: మండలంలోని ఉటుకుంటతండా అనుబంధ గ్రామం డేగవత్‌తండాలో ప్రతిష్ఠించిన గణనాథుడికి సర్పంచ్‌ లలితామంజునాయక్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించగా తండాకు చెందిన భద్రునాయక్‌ రూ.8వేలకు వేలంలో దక్కించుకున్నాడు. అదేవిధంగా గుండేడ్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి టీఆర్‌ఎస్‌ మండల ప్రధా న కార్యదర్శి చెన్నారెడ్డి దంపతులు పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జ్యోతి, విండో డైరెక్టర్‌ మంజునాయక్‌, కోఆప్షన్‌ సభ్యుడు దాసునాయక్‌ పాల్గొన్నారు.

టీటీగుట్టలో..
మహబూబ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 15: గణేశ్‌ యువజ న సంఘం, మున్సిపల్‌ ఎలక్ట్రీషన్స్‌ ఆధ్వర్యంలో టీడీగుట్ట లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మున్సిపల్‌ చై ర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ పూజలు చేశారు. అ నంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రామ్‌ పాల్గొన్నారు.

వినాయకుడికి వీసీ పూజలు
మహబూబ్‌నగర్‌టౌన్‌, సెప్టెంబర్‌ 15 : పాలమూరు వి శ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌ పీయూలో వినాయకుడికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీ యూ రిజిస్ట్రార్‌ పవన్‌కుమార్‌, అధ్యాపకులు, సిబ్బంది, వి ద్యార్థులు పాల్గొన్నారు.

హన్వాడ మండలంలో..
హన్వాడ, సెప్టెంబర్‌ 15 : మండలంలోని ఎల్లబాయి తండాలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను ఎంపీటీసీ సో నిబాయి కుమారుడు చిన్నమ్మ, సురేశ్‌ రూ.65వేలకు, మ రో లడ్డూను ఇదే తండాకు చెందిన చిన్యేనాయక్‌ రూ.30వేలకు వేలంలో దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జనానికి తరలించారు. సల్లోనిపల్లి, హన్వాడ, నాయినోనిపల్లి, మా దారం గ్రామాల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఆకట్టుకున్న అడుగుల భజన
కోయిలకొండ, సెప్టెంబర్‌ 15: మండలంలో మోదీపూర్‌తండా, కోయిలకొండలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం నిర్వహించారు. పల్గుచాకల్‌పల్లిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అడుగల భజన విశేషంగా ఆకట్టుకున్నది. మోదీపూర్‌తండాలో యువకులు ప్రత్యేక అలంకరణతో ని మజ్జనానికి తరలించారు. నిమజ్జనంలో విద్యుత్‌ వైర్లు వే యకుండా ఎస్సై సురేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ కృష్ణయ్య ప్రత్యేక చ ర్యలు చేపట్టారు.

ఉత్సాహంగా నిమజ్జనం
మిడ్జిల్‌, సెప్టెంబర్‌ 15 : మండలకేంద్రంతోపాటు బో యిన్‌పల్లి, వాడ్యాల్‌, వేముల, వల్లభురావుపల్లి, దోనూర్‌, మున్ననూర్‌ తదితర గ్రామాల్లో ఉత్సవ సంఘూల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలను నిమజ్జనాలకు తరలించా రు. మహిళల బతుకమ్మలు, కోలాటాలతో వినాయక మం డపాల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది.

నవాబ్‌పేట మండలంలో…
నవాబ్‌పేట, సెప్టెంబర్‌ 15 : మండలంలోని కొల్లూరు లో గణేశ్‌ నిజ్జనం నిర్వహించారు. భజనలు, కోలాటం, నృ త్యాలు చేస్తూ గ్రామ శివారులోని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సౌజన్య, మండపం ని ర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.

మమ్మరంగా నిమజ్జనం
మహబూబ్‌నగర్‌ సెప్టెంబర్‌ 15: గణేశ్‌ విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసి ఆరురోజులు పూర్తికావడంతో జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు నిర్వహించారు. పలు ప్రాం తాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బ్యాండ్‌మేళాలలతో జిల్లాకేంద్రానికి చుట్టుపక్కలున్న చెరువుల్లో నిమజ్జనం చేశా రు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి కోలాటాలు ఆ డుతూ భజనలు చేశారు. వాడవాడలో గణేశుడి సంకీర్తనలు మార్మోగుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana