e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జోగులాంబ(గద్వాల్) గ్రామ పంచాయతీ స్థలం కబ్జా

గ్రామ పంచాయతీ స్థలం కబ్జా

  • అనుమతి లేకుండానే నిర్మాణాలు
  • అడ్డుకున్న అఖిల పక్ష నాయకులు
  • ఎంపీడీవో యశోదమ్మ, డీఎల్‌పీవో శ్రీనివాసులు ఫిర్యాదు

మరికల్‌, జూలై 30 : మండలకేంద్రంలోని మాధవరం రో డ్డుకు సమీపంలో మంచినీటి ట్యాంక్‌ వద్ద గల స్థలాన్ని శుక్రవారం వార్డు సభ్యులు కబ్జా చే సుకొని దుకాణాల నిర్మాణానికి ప్రయత్నించారు. విషయం తె లుసుకున్న అఖిల పక్ష నాయకు లు పనులను అడ్డుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఏ విధంగా నిర్మా ణ పనులు చేపడుతారని ప్రశ్నించారు. ఉపసర్పం చ్‌ శివకుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ తీర్మా నం చేసిన నిధులతోనే నిర్మాణాలు చేస్తున్నామన్నారు.

అధికారులు లేకుండా ఎలా నిర్మాణ పను లు చేస్తారని, పంచాయతీ తీర్మానం చూపెట్టాలని అఖిల పక్ష నేతలు పట్టుబట్టి ఎంపీడీవో, డీఎల్‌పీవోకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్కడి చేరుకున్న ఎంపీడీవో యశోదమ్మ పంచాయతీ తీర్మా నం చెల్లుబాటు కాదని, డీఎల్‌పీవో ద్వారా డీపీవో అనుమతి ఉంటేనే పంచాయతీ స్థలంలో నిర్మాణా లు చేపట్టాలని తెలుపడంతో వార్డు సభ్యులు వెనుదిరిగారు. అనంతరం డీఎల్‌పీవో శ్రీనివాసులు గ్రామ పంచాయతీకి చేరుకొని సర్పంచ్‌ గోవర్ధన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించి వార్డు సభ్యులు కబ్జా చేయడం తప్పని, ఉన్నతాధికారుల అనుమతితోనే దుకాణాల నిర్మాణం చేపట్టాలన్నారు. ని బంధనలకు వ్యతిరేకంగా నిర్మాణ ప్రయత్నలు చే స్తే చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

పాత దుకాణాలను కూడా పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలి
గ్రామ పంచాయతీకి సంబంధించిన 24 పాత దుకాణాలు కూడా పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశా రు. పాత దుకాణాలకు సంబంధించిన కిరాయి ద ళారులు తీసుకుంటున్నారన్నారు. ప్రతి నెలా పం చాయతీ సుమారు రూ.లక్షా 50 వేల ఆదాయం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, రాజేశ్‌, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, రమేశ్‌, శేఖర్‌, యువక మం డలి అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana