ఊట్కూర్, జూలై 30 : వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువే. వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇండ్ల వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో విద్యుత్‌తో బోరు బావులు, వాగులు, నదుల వద్ద విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసి పం ట సాగు చేస్తారు. ఈ సమయంలో మోటర్ల వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే అనుమతి లేని వ్యక్తులు ఫ్యూజులు మార్చడం, వీధి దీపాలు మార్చడం చేయకూడదు. ఇంట్లో ఎర్తింగ్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. రేకుల ఇండ్లకు విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే విద్యుత్ తీగ చిన్నగా తెగినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో బట్టలు ఆరవేసుకునేందుకు కట్టే వైరు విద్యుత్ తీగకు దగ్గరగా లేకుండా చూసుకోవాలి. అలాగే కర్రలకు విద్యుత్ తీగలు అమర్చిన చోటికి వెళ్లకూడదు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ మాట్లాడకూడదు. విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగలు కిందకు వాలిన సమయాల్లో విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వెంటనే సరి చేయించుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు విద్యుత్ వస్తువులను తాకకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో రైతులు మోటర్లు వేసే ముందు కాళ్ల కు చెప్పులు తప్పకుండా ధరించాలి.
పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు చిన్న చిన్న మరమ్మతులు చే స్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ పూర్తిగా నిలిచిపోకపోతే విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాల్సి వస్తే విద్యుత్ సి బ్బందికి సమాచారం అందించాలి. ఇక విద్యుత్ మోటర్లు వాడే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఒక ఫేజ్ కాలిపో తే మోటర్ మొత్తానికి విద్యుత్ ప్రవహిస్తుంది. కాబట్టి ఆసమయంలో మోటర్‌కు తగలకూడదు. మోటర్ పని చేయని సమయాల్లో చేతితో దానిని తాక కూడదు. టెస్టర్ ఉపయోగించి మాత్రమే మోటర్‌ను పరీక్షించాలి. ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. మోటర్‌పై రేకును అ మర్చాలి. వర్షం పడితే తడవకుండా కాపాడుకోవాలి. అంతే కాకుండా పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల, స్టార్టర్ బాక్స్‌ల చు ట్టూ పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. వర్షాకా లం కాబట్టి వాటి చుట్టూ ఉన్న మొక్కలు పచ్చిగా ఉండడం తో విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
స్టార్టర్లను పొడి ప్రదేశంలో మా త్రమే అమర్చాలి. స్టార్టర్లకు రక్షణగా ఉండేందుకు కవర్లను ఉంచుకోవాలి. తెగిన విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలి. సర్వీసు తీగ తెగినప్పుడు గుడ్డ ముక్కతో అతికిస్తారు. ఇది చాలా ప్రమాదక రం. వీలైనంత వరకు తెగని తీగలను మాత్రమే వాడాలి. విద్యుత్ తీగలు మోటర్ల వద్ద కింద పడి ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. తీగ ఎక్కడ చిన్నగా తెగి నా నడిచే టప్పుడు కాని, స్విచ్ ఆన్ చేసే సమయంలో తగిలితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇ లాంటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్‌తో ఎలాంటి ప్రమాదా లు జరిగే అవకాశాలు ఉండవు.
జాగ్రత్తలు పాటించాలి..
వర్షాకాలం ఇండ్లలో విద్యుత్‌తో జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను, స్విచ్‌లను తాక కూడదు. ఇక పంట పొలాల వద్ద రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ బాక్స్‌లు, విద్యుత్ మో టర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే సొతంగా మరమ్మతులు చే యకూడదు. సంబంధిత లైన్మెన్, విద్యుత్ సి బ్బందికి తెలియజేయాలి.