e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) పాలమూరు ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకెళ్తాం

పాలమూరు ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకెళ్తాం

  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూలై 26 : పాలమూరు పేరు ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ కన్వెన్షన్‌లో లబ్ధ్దిదారులకు కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,211 మందికి రేషన్‌కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. అ ర్హులకు కార్డులు ఇస్తామని, మిగిలిన వా రు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మం డలంలో 103 నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేశామన్నారు.

మంత్రికి ఘన సన్మానం..
రామప్ప దేవాలయం యూనెస్కో గు ర్తింపు పొందిన సందర్భంగా కలెక్టర్‌ ఆ ధ్వర్యంలో అధికారులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గజమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ తెలంగాణలో రామప్ప దేవాలయం వంటి 10 కట్టడాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవిగా ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్‌లోనూ మన్యంకొండ, పిల్లలమర్రి, అబ్దుల్‌ఖాదర్‌దర్గా వంటివి ఎన్నో ప్రసిద్ధి చెందినవి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెం కట్రావు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌నందలాల్‌పవర్‌, మున్సిప ల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణే శ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, డీఎస్పీ శ్రీధర్‌, డీఎస్‌వో వనజాత, పౌరసరఫరాల డీఎం జగదీశ్‌, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులున్నారు.

- Advertisement -

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, జూలై 26 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలానికి సంబంధించిన రేషన్‌ కార్డులను కోడూ రు గ్రామంలో పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ కోడూ రు పీహెచ్‌సీ ద్వారా చుట్టుపక్క గ్రా మాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చే యాలన్నారు. పాముకాటు మందు అం దుబాటులో ఉంచాలని, డాక్టర్‌, అంబులెన్స్‌ను రెగ్యులర్‌గా ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్‌ ఎంపీపీ అనిత, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, ఆర్డీవో పద్మశ్రీ, సర్పంచ్‌ శ్రీకాంత్‌ గౌడ్‌, తాసిల్దార్‌ పాండు పాల్గ్గొన్నారు.

రైతులు ఆవేదన పడేటోళ్లు..
మూసాపేట(అడ్డాకుల), జూలై 26 : సమైక్యపాలనలో నీళ్లు, కరెంట్‌, ఎరువు లు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు వర కు రైతులు అనుక్షణం ఆవేదనలో పడేవాళ్లని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా లేవని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అడ్డాకుల మండలంలోని కందూరు అ నుబంధ గ్రామమైన గౌరిదేవునిపల్లి, మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న పెద్దవాగుపై రూ.4.38 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను సోమవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించా రు. అలాగే అడ్డాకుల, మూసాపేట మం డలాల్లో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజల కోసం ఏమీ చే యని నాయకులు అభివృద్ధిని చూసి ఓ ర్వలేక కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారన్నారు. వారికి మీ మాటలతోనే బుద్ధిచెప్పాలన్నారు.

ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాని, అధికారులు కూడా పూ ర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ దేవరకద్ర ఇంతలా అభివృద్ధి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని, నిరంతరం కష్టపడే ఎమ్మెల్యే ఆల, మం చి పాలన అందిస్తున్న సీఎంతోనే అభివృ ద్ధి సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కృష్ణానదికి వచ్చే వరద ముందుగా మన రైతులకు అందించాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ప్రతి ఏడాది వర్షాలు మొదలైన వెంటనే సీఎం తనకు తరచూ ఫోన్‌ చేస్తారని, వరద వస్తే లి ఫ్ట్‌లు ప్రారంభించి చెరువులు నింపాలని సూచిస్తారన్నారు. నియోజకవర్గంలో 18 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయన్నా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీలు నాగార్జునరెడ్డి, కళావతి, సర్పంచ్‌ శ్రీకాం త్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana