నవాబ్‌పేట, జూలై 13 : మండలంలోని తీగల్‌పల్లి గ్రామంలో మంగళవారం పోచమ్మ బోనాల ఉత్సవాల పం డుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు బోనాలతో ఊ రేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశా రు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగయ్య, ఎంపీటీసీ రాజ్‌కుమార్, నాయకులు చెన్నయ్య, వెంకటేశ్, నరేందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, జూలై 13 : మండలంలోని కొంరెడ్డిపల్లి గ్రామం లో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 13 : మండలంలోని దమ్మాయపల్లిలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ హన్మంతు, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.