e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home జిల్లాలు అడవులను అభివృద్ధి చేసుకోవాలి

అడవులను అభివృద్ధి చేసుకోవాలి

ప్రజలు భాగస్వాములు కావాలి
ప్రతాప రుద్రుడి కోట అభివృద్ధికి కృషి
అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి

అమ్రాబాద్‌, జూలై 29 : అడవుల అభివృద్ధిలో ప్రజ లు భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మండలంలోని మన్ననూర్‌లో అటవీ శాఖ, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులు పెరిగితేనే మానవ అవసరాలు తీరుతాయన్నారు. అప్పుడే మనుగడ సులభతరం అవుతుందని తెలిపారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో పెద్దపులుల సంఖ్య గతంలో కంటే అధికమైందన్నారు. అటవీ జంతువులను ప్రేమించాలే తప్ప వధించవద్దని సూచించారు. ప్రజలతో అటవీ సిబ్బంది మమేకమై పనిచేయాలని, వారికి అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. జీవవైవిధ్య సంరక్షణను అందరూ తెలుసుకోవాలని సూచించారు. అడవుల అభివృద్ధి, వణ్యప్రాణుల సంరక్షణ తదితర బాధ్యతలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ప్రతాప రుద్రుడి కోటకు వెళ్లి అక్కడ పర్యాటకంగా చేసడుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆమె చె ప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌డీపీటీ శ్రీనివాస్‌, డీఎఫ్‌వో కిష్టగౌడ్‌, ఎఫ్‌డీ రోహిత్‌ గోపిడి, ఐఎఫ్‌ఎస్‌ నవీన్‌, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌, మనోహర్‌, అర్చన, ఆదిత్య, ఎల్ల య్య, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
అచ్చంపేట రూరల్‌, జూలై 29 : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి కోరా రు. గురువారం మండలంలోని రంగాపూర్‌ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో 33 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జపాన్‌ ప్లాంటేషన్‌ను కలెక్టర్‌ శర్మన్‌తో కలిసి ఆమె పరిశీలించారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కల సం ఖ్య, సరిగ్గా పెరగకపోవడం మొదలైన విషయాలను తె లుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంతువులకు ఆహారంగా కాయలు, పండ్లు లభించే 14,443 మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క రూ భాగస్వాములై ప్రభుత్వం చేపట్టిన హరితహారం లక్ష్యాలను చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అడవి జంతువులను కాపాడుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు. అమ్రాబాద్‌ మండలంలోని ప్రతాపరుద్రుడి కోటను సందర్శించి విశిష్టతను తెలుసుకున్నారు. కార్యక్రమం లో ఎఫ్‌డీ శ్రీనివాస్‌, డీఎఫ్‌వో కిష్టగౌడ్‌, ఎఫ్‌డీవోలు రోహిత్‌, శ్రీనివాస్‌, ఐఎఫ్‌ఎస్‌ నవీన్‌, ఎఫ్‌ఆర్వో మనోహర్‌, సెక్షన్‌ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఉమామహేశ్వర క్షేత్రంలో పూజలు
శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. పాపనాశనం, పరిసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana