e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Omicron | ఎప్ప‌టిక‌ప్పుడు రూపం మార్చుకుంటున్న క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌మా?

Omicron | ఎప్ప‌టిక‌ప్పుడు రూపం మార్చుకుంటున్న క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌మా?

Omicron variant | ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో మళ్లీ దాడి మొదలుపెట్టింది. అసలు ఈ మహమ్మారి నుంచి మానవాళి బయటపడుతుందా? అది ఎప్పటికి సాధ్యమవుతుంది? అన్న ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో.. గతంలో యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్‌పై మానవాళి ఎలా పోరాడింది? దానినుంచి ఎలా విముక్తి సాధించింది? అన్నది, కరోనాపై విజయానికి ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుపుతుందనటంలో సందేహం లేదు.

Omicron variant
Omicron variant

19వ శతాబ్దంలో వైద్యరంగంలో జరిగిన అభివృద్ధి ఫలితంగా అనేక వ్యాధుల నుంచి మానవాళికి విముక్తి లభించింది. యాంటీబాడీల ఆవిష్కరణ కలరా, ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులను తరిమికొట్టింది. టీకాలు, వ్యాక్సిన్ల వల్ల మశూచి వంటి వ్యాధులు కనుమరుగయ్యాయి. లక్షలాది మందికి అంగవైకల్యం కలిగించిన పోలియో మనదేశంలో లేకుండా పోయిందంటే దానికి కారణం టీకానే. శతాబ్దాల పాటు తమను వణికించిన అనేక వ్యాధులపై విజయం సాధించటంతో.. ప్రకృతిని అదుపులోకి తెచ్చుకున్నామన్న అతిశయం మానవాళిలో పెరిగిపోయింది. ఫలితంగా ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించటం మొదలైంది. ఫలితంగానే వింత వ్యాధులూ, వైరస్‌లూ.

- Advertisement -

స్వలింగసంపర్కం, అసహజమైన లైంగిక పద్ధతులు, విచక్షణరహిత లైంగిక సంబంధాలు.. మానవాళి అంతకుముందు ఎన్నడూ చూడని కొత్త వ్యాధిని తీసుకొచ్చాయి. 1980 దశాబ్దం ప్రారంభంలో.. రోగ నిరోధకశక్తి బాగా దెబ్బతిన్న రోగులను వైద్యులు గుర్తించారు. స్వలింగ సంపర్కులలో ఈ కేసులు అత్యధికంగా ఉండేవి. ఈ వ్యాధి కారక వైరస్‌ను గుర్తించారు. దానికి ‘హ్యూమన్‌ ఇమ్యునో డెఫీసియన్సీ వైరస్‌’ (హెచ్‌ఐవీ) అని పేరు పెట్టారు. ఈ వైరస్‌ కలిగించే వ్యాధి పేరే ‘అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫీసియన్సీ సిండ్రోమ్‌’ (ఎయిడ్స్‌). దీనికి చికిత్స అనేదే లేదు. ఉన్న ఔషధాలు కూడా చాలా తక్కువ. దీంతో ఈ వ్యాధి వ్యక్తులను, రాష్ర్టాలను, దేశాలను దాటి వ్యాపించింది. ప్రపంచాన్ని వణికించింది. ఆఫ్రికా, అమెరికా, యూరప్‌లలో మొదలైన ఎయిడ్స్‌ ప్రపంచదేశాలన్నింటా వ్యాపించింది. మనదేశంలో 1986లో తొలి కేసులు నమోదయ్యాయి. క్రమేణా దేశమంతటా వ్యాపించింది.

ఈ నేపథ్యంలో ఎయిడ్స్‌కు చికిత్స అందించటం కంటే.. అసలు ఆ వ్యాధికి గురికాకుండా నివారించే మార్గాలపై ప్రపంచం దృష్టిపెట్టింది. విచ్చలవిడి లైంగిక సంబంధాలు, అసహజమైన లైంగిక కార్యకలాపాలను నివారించటం, కండోమ్‌ల వాడకాన్ని ప్రోత్సహించటం, ఇంజెక్షన్‌ ద్వారా డ్రగ్స్‌ తీసుకోకుండా ఉండటం, తల్లి నుంచి శిశువుకు హెచ్‌ఐవీ సోకకుండా చర్యలు చేపట్టడం, రక్తమార్పిడిలో జాగ్రత్త వహించటం వంటి పలు చర్యలు తీసుకున్నారు. దేశంలో జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ ను, రాష్ర్టాల స్థాయిలో 35 ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలను ఏర్పాటు చేశారు. ఎయిడ్స్‌ నివారణ పట్ల భారీఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఓవైపు సామాజిక చైతన్యాన్ని పెంచుతూ మరోవైపు ఎయిడ్స్‌ రోగులకు చికిత్స అందించే కార్యక్రమాలను అమలుపరిచారు. వైద్యరంగంలో సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా ఎయిడ్స్‌ చికిత్సకు సమర్థమైన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 1986 నుంచి పెరుగుతూ వచ్చిన ఎయిడ్స్‌ కేసులు 2000 నుంచి క్రమేణా తగ్గుతూ వచ్చాయి. నేడు ఎయిడ్స్‌ వ్యాప్తి గణనీయంగా పడిపోయి, కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది.

రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ తీసుకున్న పటిష్ఠమైన చర్యలతో కొత్త కేసుల సంఖ్య 0.08 శాతానికి పడిపోయింది. మరణాల విషయంలోనూ ఇదే జరిగింది. రాష్ట్రంలో ఎయిడ్స్‌ మరణాలు పురుషుల్లో 72 శాతం, స్త్రీలలో 75 శాతం, పిల్లల్లో 77 శాతం మేర తగ్గాయి. ప్రాథమిక స్థాయి నుంచి అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్‌ బాధితులకు అందించిన వైద్య సౌకర్యాల కారణంగానే ఇది సాధ్యమైంది. ఉదాహరణకు.. హెచ్‌ఐవీ కేసులను ప్రారంభంలోనే గుర్తించటం కోసం రాష్ట్రంలో 1,038 సమీకృత కౌన్సెలింగ్‌, పరీక్ష కేంద్రాలు సేవలందిస్తున్నాయి. వీటికి తోడుగా 22 ఏఆర్‌టీ సెంటర్లు, 53 ఎస్‌టీఐ క్లినిక్‌లు, 76 లింక్‌ ఏఆర్‌టీ సెంటర్లు, 13 కేర్‌ సపోర్ట్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి.

ప్రకృతిపై విజయం సాధించామన్న మనిషిని మరో మారు ప్రకృతి పరిహాసం చేసింది. కంటికి కనిపించని వైరస్‌లు మానవాళిని బలితీసుకుంటున్నాయి. ఎయిడ్స్‌, ఎబోలా, జికా, నిఫా, ఇప్పుడు కరోనా.. ఇవన్నీ వైరస్‌ కారణంగా వ్యాపించినవే. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలోనే కలిసిపోయే మనిషి తన మూలాల్ని మర్చిపోవద్దని, పర్యావరణాన్ని విధ్వంసం చేయవద్దనే హెచ్చరిక చేస్తున్నాయి. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన తత్వవేత్త జార్జ్‌ శాంతయన చెప్పిన ‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివాళ్లు తిరిగి అవే పొరపాట్లు చేస్తుంటారు’ అనే మాటలను గుర్తుచేసుకోవటం అవసరం. మానవాళి తన పాత తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రకృతిని గౌరవించాలి. నైతిక నడవడికను అలవర్చుకోవాలి. అప్పుడే కరో నా వంటి విపత్తులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌
98480 79603

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Omicron | దేశంలోకి ఎంటరైన ఒమిక్రాన్‌.. అక్కడే రెండు కేసులు: కేంద్రం

Omicron variant | 1963లోనే ఒమిక్రాన్ వేరియంట్‌.. అప్పుడే ఓ సంచ‌ల‌నం

New Omicron Cases: దక్షిణాఫ్రికాలో ఒక్క రోజులో.. రెట్టింపు ఒమిక్రాన్ కేసులు

Omicron | ఎప్ప‌టిక‌ప్పుడు రూపం మార్చుకుంటున్న క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌మా?

క‌రోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్య‌క్షుడికి సంబంధ‌మేంటి?

ఒమిక్రాన్ భ‌యం.. బూస్ట‌ర్ డోస్ వేసుకోవాలా? ఇది క‌రోనా కొత్త వేరియంట్ నుంచి ర‌క్షిస్తుందా?

Omicron | ఒమిక్రాన్ అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా? దీన్ని చూసి ప్ర‌పంచ దేశాలు ఎందుకు భ‌య‌ప‌డుతున్నాయి?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement