Omicron variant | కరోనా మహమ్మారి రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్‌గా పరివర్తనం చెంది ప్రపంచ దేశాలను భయపెట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పుడు భారత్‌లోకి కూడా వచ్చేసింది. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే ఈ ఒమిక్రాన్ ఇప్పుడే కాదు.. 1963లో కూడా వచ్చిందన్న విషయం తెలుసా ! అవునా అని షాకవ్వకండి.. అదేమీ కరోనా వైరస్ కాదు.. అది ఒమిక్రాన్ అనే ఇటాలియన్ సినిమా. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ ఒమిక్రాన్ సినిమా ( Omicron movie ) గురించి అందరికీ తెలిసింది.
ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్.. చిన్న యాక్సిడెంట్లో చనిపోతాడు. కానీ ఏమవుతుందో ఏమో కానీ కొద్దిసేపటికే మళ్లీ లేస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాటిని చిత్ర విచిత్రంగా చూస్తుంటాడు. వింతగా ప్రవర్తిస్తుంటాడు. తన చుట్టూ ఉన్న అంశాల గురించి తెలుసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. తాను తెలుసుకున్న వివరాల గురించి సమాచారం ఎవరికో పంపిస్తుంటాడు. అసలు ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాదు. ఇంతలోనే అసలు విషయం బయటపడుతుంది. అదేంటంటే.. అతను ఫ్యాక్టరీ వర్కర్ కాదు.. అతని శరీరాన్ని ఒక ఏలియన్ (గ్రహంతరవాసి) స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. భూమిని ఆక్రమించుకోవాలని ఒమిక్రాన్ వాసులు భావిస్తారు. ఇందుకోసం భూమి మీద ఉన్న పరిస్థితులను తెలుసుకుని సమాచారం అందజేయాలని ఆ ఏలియన్‌ను పంపిస్తారు. మరి భూమిపైకి వచ్చిన ఆ ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన మిషన్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యిందనేది సినిమా స్టోరీ.
1963లోనే వచ్చిన ఈ సినిమా ఒమిక్రాన్ గురించి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. ఒమిక్రాన్ వేరియంట్‌పై 1963లోనే ఒక సినిమా వచ్చింది.. ఒక సారి ట్యాగ్‌లైన్ చూడండి అంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ వేరియంట్ అనే సినిమా పోస్టర్‌ను కూడా ట్వీట్ చేశాడు. అందులో ఆ రోజు భూమి స్మశానంగా మారబోతోంది అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇప్పటికే పలు సినిమాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పలు ఫేక్ మూవీ పోస్టర్లు కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్జీవీ చేసిన ట్వీట్‌లోనూ ఓ మిస్టేక్ ఉంది. ఒమిక్రాన్ పై 1963లోనే మూవీ వచ్చిందన్న మాట వాస్తవమే. కానీ ఆర్జీవీ పోస్ట్ చేసిన పోస్టర్ మాత్రం నకిలీది. 1963లో వచ్చిన ఇటాలియన్ సినిమా పేరు ఒమిక్రాన్. ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్‌పై రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి 1963లో వచ్చిన ఇటాలియన్ మూవీ ఒమిక్రాన్. రెండోది 1999లో వచ్చిన ప్రాజెక్ట్ ఒమిక్రాన్ ( ఏ విజిటర్ ఫ్రమ్ ప్లానెట్ ఒమిక్రాన్ ).
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron | దేశంలోకి ఎంటరైన ఒమిక్రాన్.. అక్కడే రెండు కేసులు: కేంద్రం
New Omicron Cases: దక్షిణాఫ్రికాలో ఒక్క రోజులో.. రెట్టింపు ఒమిక్రాన్ కేసులు
Omicron | ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటున్న కరోనా వైరస్ నుంచి బయటపడగలమా?
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
ఒమిక్రాన్ భయం.. బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇది కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షిస్తుందా?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?