e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఎడిట్‌ పేజీ రైతు బతుకు

రైతు బతుకు

మట్టిభూమి తనకు మాగాణి బంగారు
వట్టి పొలము పైన వర్షధార!
రైతు పాలిటదియు రత్నాల హర్షమ్ము
దుక్కి దున్నునట్టి దూత ధాత!!

రైతుభూమి దిలను రక్త సంబంధము
తరతరాలుగాను తరగని నిధి!
కలిమి లేములున్న కడపుకింతన్నము
పెట్టువాడు భువిన గట్టివాడు!!

- Advertisement -

తనదు డొక్కలెండి తపనపడిన గాని
పరుల క్షుత్తు దీర్చు పరమ దాత!
ఎండ వానయనక యెదురుగా నిల్చియు
పొలము దున్ని సతము పొట్టనింపు!!

పగలు రాత్రిలేదు పంట మీదయె చూపు
భార్య తోడుగున్న బలము తనకు!
కలుపుదీయ పంట కనకపు రాశులె
ఇల వేల్పుగాను యింట జేర్చు!!

ఎండినట్టి డొంకకెవ్వరు చేయూత
నిచ్చువారు మహినింద్ర సములు!
హాలికులకు మహిన నాపదలను దీర్చ
పుడమి ప్రభుత కిలను పుణ్యమబ్బు!!

డాక్టర్‌ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana