తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పండుగ ఇది. తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేకతలను తెలిపే పండుగలలో బతుకమ్మ ఒకటి. చెరువు మానవులకు జీవనాధారం. మానవులు తమ జీవికకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు. తెలంగాణలో ప్రజల జీవితం చెరువులతో ముడిపడి ఉంది. అందుకే వారు చెరువులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన బతుకమ్మ పండుగ ఆవిర్భావానికి చరిత్రలో అనేక నేపథ్యాలు, జానపద కథనాలు, చారిత్రక అంశాలు ఉన్నాయి.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో కలిపేవారు. వాళ్ళు తిరిగిన ప్రదేశాలలో ఎన్నో వాగులు, ప్రవాహాలను భిక్కీరులుగా పిలిచేవారు. ఒక్క తెలంగాణలోనే అం దువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించి ఉంటారు. దానికి వారి కోర్కెలు తీర్చిన అమ్మదేవతకు ప్రతీకగా ఆ పూజను చేసి ఉంటారు. బౌద్ధు లు పూజించిన స్థూపాకారమే అనంతరకాలంలో బతుకమ్మ అయి ఉంటుంది. అందుకే దానిని స్థూపాకారంగ పూవులతో పేర్చి అనంతరం నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.
గిరిజనులు తమ జీవితాలు బాగుండాలని ఆరోగ్యవంతమైన సంతానం కలగాలని అమ్మ తల్లిని మొక్కుకునే ఆనవాయితీ ద్రావి డ దేశంలో అతిపురాతన కాలం నుండి ఉన్న ది. పిల్లలను బతికించమని వేడుకునే దేవతలలో బతుకమ్మ ఒక దేవత. ఈ దేవత వరాన పిల్లలు బతుకుతే బతుకమ్మ అని బతుకయ్య అని పేర్లు పెట్టుకుంటారు. తమ పిల్లలను చల్ల గా చూసినందుకు ఆ తల్లిని పువ్వులతో శిఖ రంగా పేర్చి బతుకమ్మగా భావించి తొమ్మిది రోజులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి, పూజానంతరం నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. కుతుబ్‌షాహీ రాజుల కాలంలో కూ డా బతుకమ్మ ఆడినట్లు తెలుస్తుంది. ఇబ్ర హీం కుతుబ్‌షా కాలంలోను అతని అనంతరం సింహాసనం అధిష్టించిన మొహమ్మద్ కుతుబ్‌షా కాలంలోను గ్రామగ్రామాన హిందువులు బతుకమ్మను ఆడినట్లు తెలుస్తుంది. ఇబ్రహీం కుతుబ్‌షా మంత్రిగా, ఆస్థానకవి గా, మిత్రునిగా ఉన్న కవి నేబతి కృష్ణమంత్రి (క్రీ.శ. 1580 -1612) రచించిన ‘రాజనీతి రత్నాకరం ’ గ్రంథంలో కుతుబ్‌షాహీల కాలంనాటి ప్రజల జీవన విధానం పండుగ లు వాటి వివరణ ఇచ్చాడు.
కుతుబ్‌షాహీల కాలం నాటి బతుకమ్మ పండుగ వారసత్వం ఆసఫ్‌జాహీల కాలంలో కూడా కన్పిస్తుంది. వీరి కాలంలో కూడా పల్లెపల్లెన బతుకమ్మ ఆడినట్లు ఆధారాలున్నాయి. దీనికి ప్రభుత్వం అడ్డుచెప్పినట్టు ఆధారాలు కూడా లేవు. ఆసఫ్జాహీ కాలానికి చెందిన తూము రామచంద్రారెడ్డి, వేముల రామభట్టు కవులు ప్రజల జీవన చరిత్రను గేయాలుగా రచించారు. అందులో కూడా బతుకమ్మ పాటలు విశేషాలు కన్పిస్తాయి. నిజాం కాలంలో కూడా బతుకమ్మను గురించి అనేక కథనాలు ఉన్నాయి.
అసఫ్ జాహీ కాలంలోనే సాంఘిక పరిస్థితులు, హిందువుల జీవన విధానం, పండుగలు, వాటి వివరణ కన్పిస్తుంది. నిజాం పాలనలో ‘రజాకారు’్ల అనేక అరాచకాలకు పాల్పడ్డారు. స్త్రీలను చెరబట్టడం, భర్తల ముందు, కుటుంబ సభ్యుల ముందు (వారిని కట్టేసి) వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడించినట్లు తెలుస్తున్నది. ఆ సమయంలో వారు పాడుతున్న పాట ఇట్లా సాగింది.
రామరామ రామ ఉయ్యాలో
శ్రీరామరామ ఉయ్యాలో,
మాతల్లి బతుకమ్మ ఉయ్యాలో
మాదేమి బతుకమ్మ ఉయ్యాలో,
సీతమ్మ చెరలు ఉయ్యాలో
ద్రౌపది కష్టాలు ఉయ్యాలో
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ కొనసాగింది. మలిదశ ఉద్యమంలో బతుకమ్మ ఉవ్వెత్తున కెరటమై ఎగసింది. 2014లో స్వరాష్ట్రం సాకారమయిన వేళ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నాటి నుంచి నేటివరకు ప్రతిఏటా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.
(అక్షరయాన్ సౌజన్యంతో)
డాక్టర్ బొల్లేపల్లి సుదక్షణ: 98495 20572