INDW vs ENGW : భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ను శ్రీచరణి దెబ్బకొట్టింది. ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి సెంచరీ భాగస్వామ్యాన్ని విడదీసింది. క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్ 200 దాటించిన నాట్ సీవర్ బ్రంట్(38)ను ఔట్ చేసింది. మిడాన్ దిశగా ఫోర్ బాదాలనుకున్న బ్రంట్‌కు షాకిస్తూ పైకి ఎగురుతూ చక్కని క్యాచ్ అందుకుంది హర్మన్‌ప్రీత్. దాంతో.. గేర్ మార్చేందుకు సిద్ధమైన ఇంగ్లండ్ కెప్టెన్ నిరాశగా పెవిలియన్ చేరింది. ప్రస్తుతం హీథర్ నైట్ (87 నాటౌట్), సోఫియా డంక్లే (1 నాటౌట్)) క్రీజులో ఉన్నారు.
ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. అయితే.. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(22), అమీ జోన్స్ (56) అదిరే ఆరంభమిచ్చారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ద్వయం నిదానంగా ఆడుతూ పవర్ ప్లేలో 44 రన్స్ రాబట్టింది. ఓవర్‌కు 5లోపు రన్‌రేటుతో సాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరూ బ్యాట్ ఝులిపించారు. అయితే.. ప్రమాదకరమైన ఈ ద్వయాన్ని విడదీసింది దీప్తి శర్మ. డేంజరస్ బ్యూమంట్ను బౌల్డ్ చేసి తొలి వికెట్ 73 పరుగుల భాగస్వా్మ్యానికి తెరపడింది. వి
𝘾𝙖𝙥𝙩𝙖𝙞𝙣 𝙘𝙖𝙩𝙘𝙝𝙚𝙨 𝘾𝙖𝙥𝙩𝙖𝙞𝙣 😎
Harmanpreet Kaur times her jump to perfection to dismiss Nat Sciver-Brunt 👏
Sree Charani gets #TeamIndia‘s 3️⃣rd wicket 👌
Updates ▶ https://t.co/jaq4eHbeV4#WomenInBlue | #CWC25 | #INDvENG | @ImHarmanpreet pic.twitter.com/KRefmEgLdC
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
కెట్ పడిన జోరు తగ్గించని జోన్స్ అర్ధ శతకం పూర్తి చేసింది. కానీ, కాసేపటికే ఆమె దీప్తి ఓవర్లో స్మృతి మంధాన చేతికి చిక్కింది. ప్రస్తుతం.. హీథర్ నైట్(87 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్(38)లు జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకొని సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. క్రాంతి గౌడ్ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో స్కోర్ 200 దాటించింది నైట్. అయితే.. ఈ మెగా టోర్నీలో గొప్పగా రాణిస్తున్న చరణి.. బ్రంట్‌ను వెనక్కి పంపి మూడో వికెట్ అందించింది. 40 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 218-3.