KTR | జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని తెలిపారు.
మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు అని కేటీఆర్ కొనియాడారు. వారి సేవలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోదగినవని పేర్కొన్నారు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం మరియు సామాజిక సేవలకు అంకితం చేశారని అన్నారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి) మరియు మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. దుఃఖకరమైన ఈ సమయంలో, బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి, జమియత్ ఉలేమా సభ్యులకు అండగా ఉంటుందని తెలిపారు.