మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 7: 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముంచిందని బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. నాగారం, దమ్మాయిగూడ, కీసర డివిజన్లలో ఆదివారం సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓట రు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బూ త్లో ఉన్న ఓటర్లను పరిశీలించి, ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఒక్క ఓటు కూడా రద్దు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వంలో మేడ్చల్‌ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని అన్నారు.
పార్టీకి బలం, బలగం కార్యకర్తలే అని.. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, మాజీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ నాయకపు మాదురి వెంకటేష్, పార్టీ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, జె.సుధాకర్ రెడ్డి, కౌకుంట్ల తిరుపతి రెడ్డి, ప్రధానకార్యదర్శి సంపనబోలు నర్సింహగౌడ్(హరిగౌడ్), మాజీ అధ్యక్షులు మోర రవికాంత్, నాయకులు గూడూరు ఆంజనేయులు గౌడ్(అంజన్న), రామా రం శ్రీ హరిగౌడ్, కౌకుంట్ల అనంత్ రెడ్డి, అన్నంరాజు శ్రీనివాస్, కౌకుంట్ల కృష్ణారెడ్డి, నిమ్మల శ్రీనివాస్, సాయినాధ్ గౌడ్, వసుపతి రమేష్ గౌడ్,నానునాయక్ తదితరులు పాల్గొన్నారు.