గంగాదేవి గుట్టపై మట్టి తవ్వకాలను నిలిపివేయాలి
ఖమ్మంజిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
- గుట్టకిందగుంపు గ్రామస్తుల డిమాండ్
కారేపల్లి, జూన్ 7 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 4వ తేదీన స్థానిక వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి గంగాదేవి గుట్టపై సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 15వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ శిలాఫలకానికి శంకుస్థాపన చేశారు.
దీనిలో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్ రూ.కోట్ల మట్టిని అమ్ముకుంటున్నాడు. దీంతో పచ్చని పర్యావరణాన్ని తలపించే తమ ఊరి గుట్టను అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారని గుట్టకిందగుంపు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఆరాధించే దేవతలు గుట్టపై కొలువై ఉన్నారని, మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గుట్టను తవ్వకుండా చదునుగా ఉన్న వేరే ప్రదేశంలో గోదాం నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మద్దతు తెలిపారు. గుట్టపై మట్టి తవ్వకాలను నిలిపివేసే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

