Russia vs Ukraine | రష్యాలోని గ్యాస్ ప్లాంట్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..!
Russia vs Ukraine | ష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వార్ కొనసాగుతూనే ఉంది. ఓరెన్‌బర్గ్ (Orenburg) ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (Gas processing plant) ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.
Russia vs Ukraine : రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వార్ కొనసాగుతూనే ఉంది. ఓరెన్‌బర్గ్ (Orenburg) ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (Gas processing plant) ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. కీవ్‌కు తూర్పు వైపు 1,700 కిలోమీటర్ల దూరం చొచ్చుకొచ్చి మరీ ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి దాడుల శక్తికి ఈ దాడి ఉదాహరణగా నిలిచింది.
ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా గ్యాస్ ప్లాంట్‌లోని ఓ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. దాడి జరిగిన ప్రదేశం జనావాసాలకు అతిదగ్గరగా ఉందని చెప్పారు. రష్యాలోని సుదూర ప్రాంతాల్లో కూడా ఉక్రెయిన్ దళాలు డ్రోన్ దాడులు చేస్తున్నాయి. గత నెల దాదాపు 2,000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకెళ్లి దాడికి తెగబడ్డ ఘటనలున్నాయి.
రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది సవాలుగా మారింది. సైబీరియా, ఊరల్ పర్వతాల్లో చమురు క్షేత్రాలను ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకొంటున్నాయి. తాజాగా సమర రీజయన్లో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్థానికులు మాత్రం చమురు రిఫైనరీని లక్ష్యంగా చేసుకొన్నట్లు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

