మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 15, 2020 , 22:46:42

సంక్షేమసారథి

సంక్షేమసారథి

తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని, గర్భవతులైన మహిళల సంక్షేమానికి అమ్మఒడి పథకాన్ని, ప్రభుత్వ దవాఖాన లో ప్రసవించిన స్త్రీలకు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థికసాయం అందుతున్నది. ఇవేగాక ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యాన్ని, హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యాన్ని సరఫరా చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు వేతనాలను 150 శాతం వరకూ పెంచింది.

పధ్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగా ణ రాష్ర్టానికి కేసీఆర్‌ ముఖ్యమం త్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధం గా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు అమలుచేయని సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. కేసీఆర్‌ ప్రారంభించిన అభివృద్ధి  ప్రణాళికలు, కల్పించిన మౌలిక వసతులు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బంగారు బాటలు వేశాయి.


మిషన్‌ భగీరథ పథకం దేశంలోనే అతిపెద్ద మంచినీటి పథకం. ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతం. 2018 డిసెంబర్‌ నాటికి తెలంగాణలోని ప్రతి గడపకూ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ ప్రాంత మహిళలకు వరప్రదాయిని. లక్షా ఆరు వందల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా పంపిణీ చేస్తున్న శుద్ధజలాలు 24 వేల 2 వందల పైచిలుకు గ్రామీణ ప్రాంతాల్లో 52 లక్షల 18 వేలకు పైబ డిన కుటుంబాలకు, 65 మున్సిపాలిటీలలో 12 లక్షల 52 వేల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం అమలు విషయమై 11 రాష్ర్టాలు అధ్యయనం చేశాయి. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌ ప్రశంసలు అందుకున్నది.


తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ప్రభు త్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా, గోదావరి నదులపై 23 మేజర్‌, 13 మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మా ణం జరుగుతున్నది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంతో పూర్తిచేస్తున్నది.దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అద్భుతం. ఈ పథ కం ద్వారా గోదావరి జలాలను దాదాపు 40 లక్షల ఎకరాలకు అందివ్వడం జరుగుతున్నది. అత్యంత వేగంగా బరాజ్‌లు, ఎత్తిపోతలకు పంపుహౌజ్‌లు, కాల్వల నిర్మాణం పూర్తయింది.


కాకతీయరాజుల కాలంలో రాష్ట్రమంతటా చెరువులు కళకళలాడుతూ జలసమృద్ధి కలిగి ఉండేవి. కాలక్రమంలో ఆ చెరువులన్నీ పూడిపోయాయి. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టి, చెరువుల్లో పూడిక తీయించడంతో చెరువులన్నీ ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి.పచ్చని చెట్లు నేలతల్లికి వస్ర్తాలు. చెట్లుంటేనే వర్షాలు పడుతా యి. తెలంగాణ అటవీ సంపదంతా నిర్లక్ష్యానికి గురై  తరిగిపోతున్నది. తెలంగాణలో అడవులను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్‌ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టా రు. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రవేశపెట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్‌' సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరూ మూడు చెట్లను నాటి, ఒక్కొక్కరూ మరో ముగ్గురికి ఈ ఛాలెం జ్‌ను అందివ్వాలి. ఈ పరంపర కొనసాగి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రమంతా హరిత తెలంగాణగా రూపొందుతుంది.


సమైక్య రాష్ట్రంలో చాలినంత విద్యుత్‌ అందించకపోవడం వల్ల భూగర్భ జలాలపై ఆధారపడిన రైతులు నానా అగచాట్లు అనుభవించారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే వ్యవసాయానికి పగ టిపూట తొమ్మిది గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చింది. 2018 జనవరి 1 నుంచి రైతులకు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తూ కేసీఆర్‌ ప్రభు త్వం కొత్త చరిత్రను సృష్టించింది.పెట్టుబడి కోసం అప్పుచేసి రైతులు ఆర్థికంగా దిగాజారుతున్నా రు. ఈ బాధల నుంచి రైతులను తప్పించడం కోసం పంటకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వమే సమకూర్చాలని కేసీఆర్‌ నిర్ణయించా రు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పం టలకు రెండు విడుతలుగా ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలను ప్రభుత్వం అందిస్తున్నది.


సింగిల్‌ విండో పథకం ద్వారా త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయ డం, రాయితీలు ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కొత్త పుం తలు తొక్కుతున్నది. టీఎస్‌-ఐపాస్‌ అమలులోకి వచ్చిన తర్వాత అనేక భారీ పరిశ్రమలు తెలంగాణ రాష్ర్టానికి తరలివస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ శాఖామాత్యులు కేటీఆర్‌ ప్రోత్సాహ ప్రోద్బలాల తో ప్రపంచ ఐటీ దిగ్గజాలు ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తున్నా యి. రాష్ట్రం ఇప్పుడు ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యో గకల్పన, నూతన విధాన రూపకల్పన మొదలుకొని డిజిటల్‌ లావాదేవీల వరకూ దేశంలోనే ముందువరుసలో నిలిచింది. ఇటీవల నెలకొల్పిన టీ-హబ్‌ ఇంక్యూబేటర్‌ తెలంగాణ ఐటీరంగాని కి మకుటాయమానం.


ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్‌ సమాజంలోని అసమానతలు తొలిగించి బలహీనులకు అండగా నిలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం పేద ప్రజలకు కనీస జీవన భద్రత కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. సాలీనా రూ.40 వేల కోట్లతో ప్రజా సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, దివ్యాంగులకు పింఛన్‌ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవేగాక మైనారిటీ విద్యార్థుల కోసం గురుకులాలు, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం, పేద ప్రజల కోసం గొర్రెలు, బర్రెల పంపిణీ పథకం, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భాల్లో పేద మైనారిటీలకు దుస్తుల పం పణీ వంటి పథకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.

కంటివెలుగు పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల కంటి జబ్బుల నివారణకు చర్యలు చేపట్టింది. ఊరూరా నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజల ముంగిట్లోకి కంటి వైద్యాన్ని తీసుకెళ్లింది. ప్రజలందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడానికి ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఈ సౌకర్యం ఇప్పటివరకూ మన దేశంలో ఎక్కడాలేదు. కేవలం సంపన్న దేశాల్లోనే అందుబాటులో ఉన్నది.


తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని, గర్భవతులైన మహిళల సంక్షేమానికి అమ్మఒడి పథకాన్ని, ప్రభుత్వ దవాఖాన లో ప్రసవించిన స్త్రీలకు కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థికసాయం అందుతున్నది. ఇవేగాక ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యాన్ని, హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యాన్ని సరఫరా చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు వేతనాలను 150 శాతం వరకూ పెంచింది.బీసీల సంక్షేమానికి కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కూడా ఒక కార్పొరేషన్‌ ను ఏర్పాటుచేసింది సీఎం కేసీఆరే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రగతి నిధిని ఏర్పాటుచేసింది. ఇలా సకలరంగాల్లో సంక్షేమానికీ, అభివృద్ధికీ పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 

(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌)


logo
>>>>>>