Garry Kasparov | న్యూఢిల్లీ, మే 4: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ వరల్డ్ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ స్పష్టత ఇచ్చారు. రాహుల్‌పై తాను జోక్ చేసినట్టు వెల్లడించారు. తాను చేసిన సూచనను సీరియస్‌గా తీసుకోవద్దని అన్నారు. రాజకీయాలు, చెస్ అంటే తనకిష్టమని ఇటీవల రాహుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాస్పరోవ్ తన ఫేవరెట్ చెస్ క్రీడాకారుడని చెప్పారు. ఆ కామెంట్స్‌పై కాస్పరోవ్ స్పందిస్తూ.. టాప్ ప్లేస్‌లో పోటీ పడాలంటే ముందుగా రాయ్‌బరేలీలో నెగ్గాలంటూ రియాక్ట్ అయ్యారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో, తన వ్యాఖ్యలపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. తన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవద్దని ఆయన అన్నారు.