ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థలాలను గుర్తించాలి
కరోనా కేసుల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి
మాస్కు లేకుండా తిరిగే వాళ్లకు రూ.1000 జరిమానా విధించాలి
హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకం చేపట్టాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
నారాయణపేట టౌన్, మార్చి 30 : ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా పట్టణం, పట్టణ సమీపంలో ఉండేలా స్థలాలను గుర్తించాలని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రియాంక వర్గీస్, సత్యనారాయణ, అరవింద్‌కుమార్ త దితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం, సెగ్రిగేషన్ షెడ్లు, క్రిమిటోరియం, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, వన నర్సరీల ఏ ర్పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్లు ఏర్పాటు కోసం నిధులను కేటాయి ంచామన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వాళ్లకు రూ.1000 చొప్పున జరిమానా విధి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానల కు కొవిడ్ కేసులు వచ్చినట్లయితే వైద్యం చేసేందుకు పూ ర్తిస్థాయిలో సమాయత్తంగా ఉండాలని, ఆక్సిజన్, వెంటిలేటర్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హరితహారం లో నాటిన ప్రతి మొక్కనూ బతికించుకోవాలని, అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. వచ్చే హరితహారం కోసం వన నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. వరి ధాన్యం కోతకు వచ్చే సమయం వచ్చిందని, గతేడాది మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన కార్యదర్శి చేసిన అన్ని సూచనలు అమలు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్, అటవీశాఖ అధికారి నారాయణరావు, పౌరసరఫరాల శాఖ అధికారి హతిరాం నాయక్, శివకుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
బ్లూ టీ గురించి మీకు తెలుసా..? దాంతో కలిగే లాభాలివే..!