e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు ఇంటింటా సర్వేతోనే కేసులు తగ్గుముఖం

ఇంటింటా సర్వేతోనే కేసులు తగ్గుముఖం

ఇంటింటా సర్వేతోనే కేసులు తగ్గుముఖం

ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌
ఎదులాపురం, జూన్‌ 10 : ఆదిలాబాద్‌ జిల్లా వ్యా ప్తంగా ఆశ కార్యకర్తలు నిర్వహించిన ఇంటింటా సర్వేతోనే కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్‌నగర్‌ పీహెచ్‌సీలో వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ద్వారా పంపించిన ప్రొటెక్షన్‌ కిట్ల ను ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలకు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాధనతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడు తూ.. వర్షాకాలం వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా డయేరియా కేసులు నమోదు కాకుం డా జగ్రత్తలు తీసుకునేలా చర్య లు తీసుకోవాలని పేర్కొన్నా రు. వారంలో ఒకరోజు డ్రైడే ని ర్వహించాలన్నారు. గత ఏడా ది పల్లెప్రగతిలో భాగంగా పరిసరాల శుభ్రత పాటించడంతో సీజనల్‌ వ్యాధుల కేసులు తక్కువగా నమోదయ్యాయని గుర్తుచేశారు. సర్వేను కొనసాగించాలని సూచించారు. ఈ ప్రొటెక్షన్‌ కిట్‌లో త్రీ లేయర్‌ మాస్క్‌లు 30, ఎన్‌95 మాస్క్‌లు 10, శానిటైజర్లు 2, సోడి యం హైపోక్లోరైట్‌ బాటిళ్లు 2, పీపీఈ కిట్లు 3, ఫేస్‌షీల్డ్‌ ఒకటి చొప్పున ఉంటాయని తెలిపారు. ఏఎన్‌ఎంలకు పల్స్‌ ఆక్సీమీటర్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ శిల్ప, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలు, డీసీఎం అనిల్‌ కుమా ర్‌, సీవో ప్రశాంత్‌దేశ్‌ పాండే పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటింటా సర్వేతోనే కేసులు తగ్గుముఖం

ట్రెండింగ్‌

Advertisement