Ground Water | లోలోతుకు భూగర్భ జలాలు.. ఏకంగా 1.74మీటర్ల పడిపోయిన జల మట్టం
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్తున్నది.
- గత ఏప్రిల్‌తో పోల్చితే ఏకంగా 1.74మీటర్ల పడిపోయిన జల మట్టం
- భూగర్భజల శాఖ నివేదికలో వెల్లడి
Ground Water | హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్తున్నది. నిరుడు ఏప్రిల్‌లో భూగర్భజలాల 8.77 మీటర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం 10.51మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నాటికి 891మి.మీ.వర్షపాతానికిగాను 930మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.
అంటే మొత్తంగా 4శాతం వర్షపాతం అధికంగా నమోదయింది. అయినప్పటికీ నిరుడు ఇదే సమయంతో పోల్చినప్పుడు 1.74మీటర్ల మేర భూగర్భజలాలు ఇప్పటికే తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భజలమట్టం మార్చి నెలలో 9.69మీటర్లు ఉండగా, ఏప్రిల్‌లో అది 10.51మీటర్లు నమోదు కాగా, నెలలోనే దాదాపు 0.82మీటర్ల మేరకు భూగర్భజల మట్టం తగ్గిపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 3జిల్లాల్లోనే సగటు భూగర్భ జలమట్టం 0.15 మీటర్లు పెరగగా, మిగతా అన్ని జిల్లాల్లో భూగర్భజలమట్టం సగటును 0.28మీటర్ల లోతుకు పడిపోయింది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3.88మీటర్లు, నల్గొండ 3.76, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.51మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే 25శాతం మేరకు అత్యధిక వర్షపాతం నమోదయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైతం 3.59మీ టర్ల మేరకు భూగర్భజలమట్టం పడిపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

