శనివారం 27 ఫిబ్రవరి 2021
Devotional - Jan 15, 2021 , 11:46:22

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభం

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభం

తిరుమల : పవిత్రమైన ధనుర్మాసం గురువారంతో ముగియడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్‌ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో 17వ తేదీ నుంచి స్వామివారికి సుప్రభాత సేవను నిలిపివేశారు. ఆ సేవకు బదులుగా గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. సంక్రాంతి పర్వదినం రోజు ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో శుక్రవారం నుంచి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు.

VIDEOS

logo