ఆదివారం 31 మే 2020
Devotional - Apr 28, 2020 , 17:34:27

రేపు తెర‌చుకోనున్న కేథార్‌నాథ్ ఆల‌యం

రేపు తెర‌చుకోనున్న కేథార్‌నాథ్ ఆల‌యం

హైద‌రాబాద్‌: ‌రేపు ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని కేథార్‌నాథ్ ఆల‌య ద్వారాలు తెర‌చుకోనున్నాయి. అయితే ఈ ఆల‌య ద్వారాలు తెరిచే కార్యాక్ర‌మానికి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కునితోపాటు కేవ‌లం 16 మంది మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ, కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌ అమ‌లు లాంటి ప‌రిణ‌మాల నేప‌థ్యంలో అధికారులు కేవ‌లం 16 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయితే, ఆల‌య ద్వారాలు తెరిచినా ప్ర‌స్తుతానికి భ‌క్తుల‌కు ప్ర‌వేశం ఉండ‌బోద‌ని ఉత్త‌రాఖండ్ దేవ‌దాయ శాఖ అధికారులు స్ప‌ష్టంచేశారు. రేపు ఆల‌యం ద్వారాలు తెరువ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే పుష్పాలంక‌ర‌ణ త‌దిత‌ర ఏర్పాట్లు వేగంగా కొన‌సాగుతున్నాయి.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo