షాబాద్, మే 10: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని ఉబ్బగుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, శేరిగూడెం వెంకటయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.