e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News 81 ఏళ్ల బామ్మ‌.. ఇప్పుడు టిక్‌టాక్‌ స్టార్‌

81 ఏళ్ల బామ్మ‌.. ఇప్పుడు టిక్‌టాక్‌ స్టార్‌

81 ఏళ్ల బామ్మ‌.. ఇప్పుడు టిక్‌టాక్‌ స్టార్‌

బెర్లిన్‌: జ‌ర్మ‌నీకి చెందిన 81 ఏళ్ల బామ్మ ఇప్పుడు టిక్‌టాక్ స్టారైంది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల లాక్‌డౌన్ ఏర్ప‌డిన స‌మ‌యంలో.. ఎరికా రిషికో చిన్న చిన్న వీడియోలు తీసింది. తొలుత ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన 12 సెక‌న్ల వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ త‌ర్వాత ఇక రిషికో ద‌శ మారింది. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్సైంది. ఇప్ప‌టి వ‌ర‌కు టిక్‌టాక్‌లో ఆ బామ్మ వంద వీడియోల‌ను పోస్టు చేసింది. ఎక్స‌ర్‌సైజ్‌లు, పుల‌ప్‌లు, డ్యాన్సింగ్ వీడియోలు చేస్తూ అంద‌ర్నీ అట్రాక్ట్ చేశారు. లాక్‌డౌన్ వేళ యాక్టివ్‌గా ఉండాల‌న్న ఉద్దేశంతో ఆ బామ్మ ఈ వీడియోల‌ను పోస్టు చేసింది. అయితే ఈ స‌మ‌యంలోనే ఆమె ల‌క్షా 25 వేల మంది ఫాలోవ‌ర్లు కూడ‌గ‌ట్టుకున్న‌ది. టిక్‌టాక్ యాప్‌లో ఆమెకు 20 ల‌క్ష‌ల లైక్‌లు కూడా వ‌చ్చేశాయి. టీనేజ‌ర్ల కామెంట్స్ త‌న‌ను ఎంక‌రేజ్ చేస్తున్న‌ట్లు ఆ బామ్మ చెబుతోంది. చాలా సంతోషంగా ఉన్నాన‌ని, గ‌తంలో ఎప్పుడూ ఇంత ఆత్మ‌విశ్వాసంతో లేన‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
81 ఏళ్ల బామ్మ‌.. ఇప్పుడు టిక్‌టాక్‌ స్టార్‌

ట్రెండింగ్‌

Advertisement