ధారూరు, మే 10 : బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఙానేశ్వర్ ను భారీ మెజారిటీలో గెలిపించుకోవాలని పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని హరిదాస్‌పల్లి, దోర్నాల్, ధారూరుస్టేషన్, నర్సాపూర్, నాగసముందర్, ధారూరు, మోమిన్‌కలాన్, అంపల్లి, మోమిన్‌ఖుర్దు, రాజాపూర్, నాగారం, అంతారం తదితర గ్రామా ల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాసాని గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయలన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిందని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అంజయ్య, రాజుగుప్త, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సంతోశ్‌కుమార్, వెంకటయ్య, రాములు, రవీందర్‌రెడ్డి, చంద్రమౌళి, అంజ య్య, గోవింద్ రాజ్‌గౌడ్, లక్ష్మన్, సుధాకర్ గౌడ్, చెన్నయ్య గౌడ్, గోపాల్ నాయక్, దేవేందర్, మునీరోద్దీన్, శ్రీశైలం, మాణిక్యం, రాములు, నారాయణ, అనంతయ్య, వీరేశం, వెంకటయ్య, సర్వేశం తదితరులు ఉన్నారు.

యాలాల : కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శంకర్ అన్నారు. మండల పరిధిలోని కోకట్ గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముస్తఫాలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గ్యారెంటీలను అమలు చేసిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాం గ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బీసీ పక్షపాతి కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంపత్, అశోక్, రాంచందర్ జావిద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బషీరాబాద్: మండలంలో బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకులు, గత రెండు మూడు రోజులుగా మండలంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్గి గ్రామంలో వీరారెడ్డి, దస్తయ్యగౌడ్, గ్రామ నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు అమలు చేసిన పథకాలను వివరిస్తూ కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓటు వేయా లని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.

దోమ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం బొంపల్లిలో ఎంపీటీసీ రాఘవపురం రాములు పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధి కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అయినాపూర్‌లో ఎంపీటీసీ అంజి విజయ, గ్రామ అధ్యక్షుడు రుక్మయ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఖమ్మంనాచారం, పాలేపల్లి, దోమ, రాకొండ, గుండాల, దిర్సంపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, బొంపల్లి మాజీ ఉప సర్పచ్ రఫీక్పాష, శ్రీనివాస్, పాష, వెంకటేశ్, నర్సింహులు, రాములు, వెంకటయ్య, శ్రీనివాస్, గుడ్ల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మధుకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని బూచన్‌పల్లి, జాజిగుబ్బడి తండాలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

పెద్దేముల్ : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముమ్మరంగా చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్ధతుగా బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు గౌడ్, మామిళ్ల వెంకట్, పిల్లి వెంకట్, శ్రీనివాస్, బుద్దారంలో తలారి శ్రీనివాస్, కందనెల్లి తండాలో స్వరూప బాయి, సాగర్, గాజీపూర్‌లో మాజీ సర్పంచ్ తలారి వీరప్ప, లాలు యాదవ్, పెద్దేముల్ తండాలో లక్ష్మణ్‌లు ఉపాధి కూలీలను కలువడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీలు నిరుపేదలకు చేసిందేమిలేద్నరు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నిరుపేదలను నిండా ముంచిందన్నారు. ఈ నెల 13న జరుగనున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.