పెద్దఅంబర్‌పేట, మే 10 : కేవలం ఎన్నికలప్పుడే వచ్చి మాటలు చెప్పే మనిషిని కాదని, ఆపదని తెలిస్తే వాలిపోతానని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఉదయం తట్టిఅన్నారం జీవీఆర్కాలనీలో పలు కాలనీల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరం ఉంటేనే వచ్చే మనిషిని కాదని, మీ కుటుంబంలో ఒకడి గా ఉంటానన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి పోతున్నారని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజల్లో విపరీతమైన సానుభూతి పెరిగిందని చెప్పారు.
భువనగిరి పార్లమెంట్ బరిలో 39మంది ఉంటే అందులో ఏ ఒక్క కేసూ లేని, మచ్చలేని వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. ప్రజాశ్రేయస్సును కాంక్షించే బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించి, మీ కుటుంబసభ్యుడిగా ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని.. ఎంపీగా గెలిపిస్తే తిరిగొచ్చి మీ మధ్యే ఉంటానని మాటిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఈదమ్మల బలరాం, పాశం దామోదర్, రావుల గోపాల్‌గౌడ్, కౌన్సిలర్లు పరశురాంనాయక్, మండల కోటేశ్వర్రావు, నాయకులు సూరయ్య, భిక్షపతి, వివిధ కాలనీల ప్రతినిధులు భాస్కరాచారి, రామ్మోహన్రావు, మానయ్య, విజయ్‌మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.