IND vs RSA : గ్రూప్ ఏలో టాపర్స్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8 తొలిపోరులో ఢీకొంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో ప్రొటీస్ జట్టు ఆడుతుండగా.. ఏ మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది.
గత సీజన్ ఫైనలిస్టులు భారత్, దక్షిణాఫ్రికా బిగ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. లీగ్ దశను అజేయంగా ముగించిన ఇరుజట్లు నాకౌట్ పంచ్ విసిరేందుకు అహ్మదాబాద్‌లో ఢీకొంటున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడిగా 5-2 రికార్డు టీమిండియా ఆధిపత్యాన్ని చాటుతోంది.
Here is #TeamIndia‘s Playing 1️⃣1️⃣ for the Super 8 clash against South Africa! 🙌
Updates ▶️ https://t.co/ZE8J4fF18z #T20WorldCup | #MenInBlue | #INDvSA pic.twitter.com/F0DYleKAEU
— BCCI (@BCCI) February 22, 2026
అయితే.. మ్యాచ్ విన్నర్లతో కళకళలాడుతున్న ప్రొటిస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక ఈ మ్యాచ్‌తోనైనా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ అందుకోవాలని మేనేజ్మెంట్, అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా మూడు డక్స్‌తో నిరాశపరిచిన అతడి స్థానంలో చోటు ఆశించిన సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రియాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాస్చ్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.