INDWA vs BANWA : అంతర్జాతీయ క్రికెట్లో భారత అమ్మాయిలు వరుసగా ట్రోఫీలు పట్టేస్తున్నారు. నిరుడు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిడియా తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా అవతరించగా.. రాధా యాదవ్ బృందం మహిళల ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్‌లో విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌పై పంజా విసిరింది. ఓపెనర్లు విఫలమైనా తేజల్ హసబ్నిస్(51 నాటౌట్) అర్ధ శతకంతో.. రాధా యాదవ్(38) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ప్రేమా రావత్(3-12) ధాటికి బంగ్లా కుప్పకూలింది. 46 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన భారత్ టైటిల్ కొల్లగొట్టింది.
సెమీఫైనల్లో భారీ విజయంతో శ్రీలంకను ఇంటికి పంపిన భారత ఏ జట్టు ఫైనల్లోనూ చెలరేగింది. అజేయంగా టైటిల్ పోరుకు దూసుకొచ్చిన బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్ షోతో దెబ్బతీసింది. శుభారంభం దక్కకపోయినా తేజల్ హసబ్నిస్(51 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రాధా యాదవ్(38) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఐదో వికెట్‌కు వీరు 69 రన్స్ జోడించి పరువు కాపాడారు. 135 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు వణికించారు.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
The Radha Yadav-led India A team clinch the #WomensRisingStarsAsiaCup title 🇮🇳 🙌
Scorecard ▶️ https://t.co/BazaDT9PQD pic.twitter.com/aCKmZ8w5aO
— BCCI Women (@BCCIWomen) February 22, 2026
టీమిండియా నిర్దేశించిన ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ ఇష్మా తంజిమ్(3)ను ఔట్ చేసిన సైమా థాకొర్ వికెట్ల వేటకు తెరసింది. షమీమా సుల్తానా(20)ను వెనక్కి పంపిన ప్రేమా రావత్(3-21) ప్రత్యర్ధిని మరింత దెబ్బతీసింది. రాధా యాదవ్ ఓవర్లో షర్మీన్ సుల్తానా(18) డగౌట్ చేరగా.. ప్రమాదకరమైన సదియా అక్తర్(10), లతా మొండల్(1)ను ఔట్ చేసిన ప్రేమ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. మరో ఎండ్‌లో తనూజ కన్వర్(2-11) సైతం చెలరేగగా బంగ్లా కోలుకోలేకపోయింది. షోఫియా ఖాతూన్(9)ను తనూజ ఔట్ చేయగా బంగ్లా 88 పరుగులకే ఆలౌటయ్యింది.
Clinical 👌
A complete all-round show from India A as they register a commanding victory by 4⃣6⃣ runs in the Final of the #WomensRisingStarsAsiaCup 👏👏
Scorecard ▶️ https://t.co/BazaDT9PQD pic.twitter.com/GNJqErWeyw
— BCCI Women (@BCCIWomen) February 22, 2026