PM Modi | అంతర్జాతీయ ఈవెంట్లో డర్టీ పాలిటిక్సా.. ఏఐ సదస్సులో నిరసనపై కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
PM Modi : అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్స్ విప్పి నిరసన చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. కాంగ్రెస్ తన డర్టీ పాలిటిక్స్ కోసం అంతర్జాతీయ వేదికను వాడుకుందని మండిపడ్డారు.
PM Modi : అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్స్ విప్పి నిరసన చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. కాంగ్రెస్ తన డర్టీ పాలిటిక్స్ కోసం అంతర్జాతీయ వేదికను వాడుకుందని మండిపడ్డారు. ఆదివారం మీరట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ‘‘ఇండియాలో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌ను కాంగ్రెస్ పార్టీ తన డర్టీ, నగ్న రాజకీయాలకు వేదికగా మార్చుకుంది. విదేశీ అతిథుల ముందు కాంగ్రెస్ నేతలు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లారు.
కానీ, దేశం మొత్తానికి మీరు (కాంగ్రెస్ పార్టీ) నగ్నంగానే ఉందని తెలుసు. అలాంటిది ప్రత్యేకంగా మీరు షర్ట్స్ తీయడం ఎందుకు..? దేశాన్ని అప్రతిష్టపాలు చేయడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. సదస్సులో తప్పు చేసిన యూత్ కాంగ్రెస్ నేతలను తప్పుబట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ వారిని పొగుడుతోంది. దీనికి సిగ్గుపడాల్సింది పోయి నేతలు వారిని ప్రశంసిస్తున్నారు. చివరకు కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా వారిని తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలైన టీఎంసీ, డీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ వంటి పార్టీలు ఈ నిరసనల్లో పాల్గొనలేదు. కానీ, కాంగ్రెస్ ఒక్క పార్టీ మాత్రమే దేశాన్ని నాశనం చేస్తోంది. మీరు ప్రధాని పదవిలో కూర్చోవాలంటే ముందుగా దేశ ప్రజల విశ్వాసాన్ని పొందండి. ఏఐ సదస్సు బీజేపీ నిర్వహించిన సదస్సు కాదు. అందుకే అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు.
ఇది ఇండియా నిర్వహించిన సదస్సు. కాంగ్రెస్ విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది. గతంలో నన్ను, నా తల్లిని అవమానించారు. ఇప్పుడు ప్రపంచం ముందు దేశం పరువు తీశారు’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఏఐ సదస్సులోని భారత్ మండపం, హాల్ నెం.5లో యూత్ కాంగ్రెస్ నేతలు షర్ట్స్ తీసేసి, అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. ఇండియా-యూఎస్ డీల్‌కు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

