SL vs ENG | స్పిన్ వ్యూహానికి శ్రీలంక చిత్తు.. సూపర్ 8లో ఇంగ్లండ్ బోణీ..!
SL vs ENG : స్వదేశంలో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనుకున్న శ్రీలంకకు ఇంగ్లండ్ పెద్ద షాకిచ్చింది. పల్లెకెల్ స్టేడియంలో విల్ జాక్స్(3-22) తిప్పేయగా.. పవర్ ప్లేలోనే కష్టాల్లో పడిన లంక.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
SL vs ENG : స్వదేశంలో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనుకున్న శ్రీలంక(Srilanka)కు ఇంగ్లండ్(England) పెద్ద షాకిచ్చింది. పల్లెకెల్ స్టేడియంలో విల్ జాక్స్(3-22) తిప్పేయగా.. పవర్ ప్లేలోనే కష్టాల్లో పడిన లంక.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 150 పరుగుల ఛేదనలో టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయగా.. కెప్టెన్ దసున్ శనక(30) పోరాడినా సరిపోలేదు. తడబడుతూ సాగిన ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌కు ఆదిల్ రషీద్(2-13) తెరదించగా.. 51 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ అదిరే బోణీ కొట్టింది.
సొంతగడ్డపై చెలరేగాలనుకున్న శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్ అస్త్రంతో పడగొట్టింది. సూపర్ 8లో లంక నుంచి స్పిన్ ముప్పును ఊహించిన హ్యారీ బ్రూక్ సేన అందుకు తగ్గట్టే సన్నద్ధమైంది. కానీ.. తీరా మైదానంలోకి దిగాక ఫిల్ సాల్ట్(62) ఒక్కడే రాణించగా ప్రత్యర్థికి 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫేవరెట్ లంక తమకు కొట్టినపిండి అయిన పల్లెకెలె స్టేడియంలో అలవోకగా గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ, పవర్ ప్లేలోనే ఇంగ్లండ్ విజయం దిశగా నడిచింది.
England start the Super Eight stage with a 12th consecutive T20I win against Sri Lanka!
The #T20WorldCup co-hosts fall apart in a disastrous chase – their second-lowest total on home soil 😱
Scorecard: https://t.co/LThW4kyyYJ pic.twitter.com/H5VyXhTuIU
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
34కే ఐదు వికెట్లు
డేంజరస్ ఓపెనర్ పథుమ్ నిశాంక(9)ను రెండో ఓవర్లోనే ఔట్ చేసి జోఫ్రా ఆర్చర్(2-20) తొలి బ్రేకివ్వగా.. అక్కడి నుంచి విల్ జాక్స్(3-22)తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. రిటర్న్ క్యాచ్‌తో కుశాల్ మెండిస్(4)ను వెనక్కి పంపిన అతడు.. పవన్ రత్ననాయకే(0), దునిత్ వెల్లలాగే(10)లను వెనక్కి పంపి ఆతిథ్య జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన వెల్లలాగే.. మిడాఫ్‌లో షాట్‌కు యత్నించి బ్రూక్ చేతికి చిక్కడంతో… 34కే లంక ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
The Real Spin Shady 😎
Will Jacks picks up his third Player of the Match award at this #T20WorldCup 👏 pic.twitter.com/JHUIXCmPdf
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
సగం వికెట్లు పడిన వేళ కెప్టెన్ దసున్ శనక(30)తో కలిసి జట్టును ఆదుకోవాలనుకున్న కమిందు మెండిస్(13).. డాసన్ వేసిన 9వ ఓవర్లో సిక్సర్ బాదాడు. కానీ, బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి లంక కష్టాలను మరింత పెంచాడు. శనకకు తోడుగా నిలిచే వారు కరువయ్యారు. ఓవర్టన్ ఓవర్లో హేమంత అనూహ్యంగా బ్యాట్‌ను వికెట్లకు తాకించి వెనుదిరిగాడు. అప్పటికే అవసరమైన నెట్రన్ రేటు పది దాటడంతో.. పెద్ద షాట్లు ఆడే క్రమంలో ఆదిల్ రషీద్(2-11) ఓవర్లో శనక వికెట్ ఇచ్చేశాడు. అతడు ఔటయ్యాక 13 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్‌కు రషీద్ తెరదించాడు. ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జట్టుకు చెక్ పెట్టిని ఇంగ్లండ్ 51 పరుగులతో గెలుపొంది.. గ్రూప్ బీలో బోణీ కొట్టింది.
సాల్ట్ ఒక్కడే
సూపర్ 8 తొలి పోరులో ఇంగ్లండ్ ఆరంభంలో తడబడినా పోరాడగలిగే స్కోర్ చేసింది. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(3-26), థీక్షణల(2-21)లు అద్భుతంగా కట్టడి చేయడంతో టాపార్డర్, మిడిలార్డర్ తేలిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిల్ సాల్ట్(62) ఒత్తిడిలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. ఆఖర్లో విల్ జాక్స్(13), జేమీ ఓవర్టన్(10 నాటౌట్)లు దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?


