CPM | సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్న అమెరికా : సీపీఐ
CPM | అమెరికా దేశం సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరింపులకు గురిచేస్తుందని సీపీఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం ఆరోపించారు.
తాండూర్ : అమెరికా ( America ) దేశం సుంకాల ( Taxes ) పేరుతో ప్రపంచ దేశాలను బెదిరింపులకు గురిచేస్తుందని సీపీఎం( CPM) పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు దాగాం రాజారాం( Rajaram ) ఆరోపించారు. సీపీఎం తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో రెడ్ బుక్ డేను నిర్వహించారు.
అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకంపై నిర్వహించిన పుస్తక పఠనంలో ఆయన మాట్లాడారు. సామ్రాజ్యవాద దురగతాలను ఎండగట్టాలి అనే ఉద్దేశ్యంతో 1948 ఫిబ్రవరి 21న లండన్లో ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళిక మేనిఫెస్టో విడుదలై ప్రకంపనలను సృష్టించిందని పేర్కొన్నారు.
భారత దేశం పైన సుంకాలు విధించి హెచ్చరికలు చేసిందని తెలిపారు. రష్యా, చైనాలు దీటుగా సమాధానాలు చెబుతుండగా, పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే మనం మోదీ నాయకత్వాన,ఒక్క మాట మాట్లాడటం లేదని ఆరోపించారు. అమెరికా సామ్రాజ్య వాదానికి తలొగ్గి దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను తాకట్టు పెడుతున్నదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నానయ్య, చెల్పుల శంకర్, బొల్లం రాజేశం, సోమ మొగిలి, లింగం బానేష్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

