జనగామ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు..హైదరాబాద్‌కు చెందిన శేఖర్ రెడ్డి భార్య ధనలక్ష్మి కుమారుడు రఘుమారెడ్డితో కలిసి తిరుమలగిరిలో వాళ్ల బావ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళ్తున్నారు.
ఈ క్రమంలో వనపర్తి సమీపంలో కారు టైర్ పేలిపోవంతో కారు అదుపు తప్పి తుమ్మలగూడెం నుంచి జనగామకు బర్రెల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా ఏస్ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో జనగామ దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Sangareddy | ట్రైనీ నర్స్‌ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా